- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్తుగా ఓడిన ఇండియా...ట్రెండింగ్ లో షమీ !
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ దారుణంగా ఓడింది. 359 పరుగుల భారీ టార్గెట్ ను

దిశ, వెబ్ డెస్క్: రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ దారుణంగా ఓడింది. 359 పరుగుల భారీ టార్గెట్ ను దక్షిణాఫ్రికా ముందు ఉంచినప్పటికీ, భారత్ ఓటమి పాలైంది. మొదటి వన్డేలో కూడా ఓటమి అంచు దాకా వెళ్లి, బతికి బయటపడింది. లేకపోతే మొదటి వన్డేలో కూడా మనోళ్లు ఓడిపోయేవాళ్లే. అయితే, రెండో వన్డేలో భారత్ ఓడిపోవడంతో, ఒక్కసారిగా మహమ్మద్ షమీ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్పటికైనా భారత జట్టులోకి మహమ్మద్ షమీని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. రెండో వన్డేలో హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ లాంటి అనుభవం లేని బౌలర్లకు ఛాన్స్ ఇచ్చి తప్పుచేశారని బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా 70 పరుగులు ఇవ్వగా, ప్రసిద్ కృష్ణ 85 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఇద్దరు బౌలర్లు పరుగులు కట్టడి చేసి, వికెట్లు తీసి ఉంటే ఇండియా విజయం సాధించేది. కానీ హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ చెత్త ప్రదర్శన కనబరిచి, భారత్ ను ఓడించారని మండిపడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలో 7 మ్యాచ్ లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు షమీ. ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్ లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన చూసైనా, షమీని తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిరాజ్ కు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే షమీ లాంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వకుండా బీసీసీఐ వ్యవహరిస్తే, భారత జట్టును కాపాడటం కష్టమే అంటున్నారు.






