- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజత్ కు మరో షాక్... RCB కి కొత్త కెప్టెన్?
బెంగళూరు జట్టులో కీలకంగా మారిన దేవ్‌దత్ పడిక్కల్ ను భవిష్యత్తులో కెప్టెన్ చేయబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: వరుసగా రెండుసార్లు ఛాంపియన్ అయిన బెంగుళూరు జట్టు ఫ్యూచర్ కెప్టెన్ ఎవరనేది తేలిపోయింది. బెంగళూరు జట్టులో కీలకంగా మారిన దేవ్‌దత్ పడిక్కల్ ను భవిష్యత్తులో కెప్టెన్ చేయబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఫ్యూచర్ కెప్టెన్ పై బెంగళూరు డైరెక్టర్ బోబాట్ టీమ్ డాక్యుమెంటరీలో కీలక విషయాలు వెల్లడించారు. దేవ్‌దత్ పడిక్కల్ లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని... ఫ్యూచర్ లో బెంగళూరు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. జట్టులో ఉన్న ఏకైక బెంగళూరు ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ ఒక్కడే అని కూడా గుర్తు చేశారు.
గేమ్ పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలడని అటు దినేష్ కార్తీక్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో వచ్చే సీజన్ లోనే రజత్ పటిదార్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్ కెప్టెన్ అవుతాడని చర్చ జరుగుతోంది. రజత్ కెప్టెన్సీలో బెంగుళూరు రెండుసార్లు ట్రోఫీ గెలిచింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత బెంగళూరుకు టైటిల్ తెచ్చిన మొనగాడు రజత్ ఒక్కడే. ఇంత సాధించిన కూడా భారత జట్టులో మాత్రం అతనికి స్థానం దక్కలేదు. ఇక ఇప్పుడు బెంగళూరు యాజమాన్యం భవిష్యత్తు కెప్టెన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రజత్ కు వచ్చే ఐపీఎల్ సీజన్ లో షాక్ తప్పడం గ్యారంటీ అంటున్నారు.






