- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షోయబ్ అక్తర్ ఇంట తీవ్ర విషాదం.. అండగా నిలిచిన సోదరుడు కన్నుమూత
'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయబ్ అక్తర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్, రావల్పిండీ ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) కుటుంబంలో తీవ్ర శోకసంద్రం నెలకొంది. ఆయన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ (Shahid Akhtar) ఇవాళ హఠాన్మరణం చెందారు. ఈ విషాద వార్తను షోయబ్ అక్తర్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ప్రియమైన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ అల్లా చెంతకు చేరారని చెప్పడానికి నేను తీవ్రంగా విచారిస్తున్నా’ అంటూ అక్తర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అయితే, ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.
కాగ, షోయబ్ అక్తర్ క్రికెట్ కెరీర్‌లో ఆయన అన్నయ్య షాహిద్ అక్తర్ అత్యంత కీలక పాత్ర పోషించారు. అక్తర్ ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో ప్రతి అడుగులోనూ షాహిద్ కొండంత అండగా నిలిచారు. అక్తర్ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఆ తర్వాత వచ్చిన అనేక వివాదాల సమయంలో షాహిద్ ఓ పిల్లర్‌లా మద్దతుగా నిలిచారు. ఫిట్‌నెస్ ట్రైనర్‌గా, ఫిజియోథెరపిస్ట్‌గా కూడా ఆయన అక్తర్ ఫిట్‌నెస్ విషయంలో కేర్ తీసుకునే వారని సమాచారం. ఈ మేరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ (Rashid Latif), పలువురు మాజీ క్రికెటర్లు షాహిద్ అక్తర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేశారు.






