PSL లో డారిల్ మిచెల్ కు బిగ్ షాక్... 1.2 కోట్ల వస్తువులు చోరీ !

by velandi.Saikiran |

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ( PSL) టోర్నమెంట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇండియన్

PSL లో డారిల్ మిచెల్ కు బిగ్ షాక్... 1.2 కోట్ల వస్తువులు చోరీ !
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ( PSL) టోర్నమెంట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) టోర్నమెంటును పోల్చుతూ... పాకిస్తాన్ సూపర్ లీగ్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు జనాలు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును దారుణంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో.. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ జరుగుతున్న తరుణంలో... భారీ దొంగతనం జరిగింది.

పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న డారిల్ మిచెల్ ( Daryl mitchell ).. ఖరీదైన వస్తువులు.. గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని సమాచారం అందుతుంది. ఆయన ధరించిన ఖరీదైన గడియారం, ఇతర వస్తువులు కూడా... దొంగిలించారట. మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చిన తర్వాత తన.. బ్యాగును లాహోర్ స్టేడియంలోని ప్రత్యేక గదిలో డారిల్ మిచెల్ పెట్టాడు. అయితే మ్యాచ్ అయిపోయేసరికి తన బ్యాగ్ చూసుకుంటే ఖరీదైన వస్తువులన్నీ ఎవరో దొంగిలించినట్లు గుర్తించాడట డారిల్ మిచెల్. వెంటనే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే... దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. డారిల్ మిచెల్ కు సంబంధించిన 1.2 కోట్ల విలువైన వస్తువులను లాహోర్ స్టేడియంలో ఇద్దరు దొంగలు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ ఇద్దరు దొంగలను 24 గంటలు గడవకముందే.. అరెస్టు చేశారు పాకిస్తాన్ పోలీసులు. ఈ విషయం బయటికి రావడంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను మళ్లీ ట్రోలింగ్ చేస్తున్నారు ఇండియన్ ఫాన్స్. క్రికెటర్ల వస్తువులకే భద్రత లేదు... అక్కడ ఉగ్రవాదులు బాంబులు వేస్తే ఎలా కాపాడుతారు అంటూ మండిపడుతున్నారు.

Next Story