- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంజు శాంసన్ కోసం చెన్నై భారీ తప్పిదం...!
జడేజాతో పాటు సామ్లాంటి ఆల్ రౌండర్ ను ఇస్తామని ఆఫర్ చేస్తోందట చెన్నై. జడేజా, సామ్ కర్రాన్ ను ఇస్తే సంజును

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. ఐపీఎల్ రిటెన్షన్ లిస్టుపై ఫోకస్ పెట్టాయి 10 జట్ల యాజమాన్యాలు. అయితే మొదటి నుంచి సంజు శాంసన్ ను ట్రేడ్ ద్వారా కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోందన్న సంగతి తెలిసిందే. ఎంత ఖర్చైనా అతన్ని జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా తెలివిగా వ్యవహరిస్తోంది రాజస్థాన్. సంజు శాంసన్ ను ఇస్తాం కానీ, జడేజాతో శివం దూబే, బ్రేవిస్ లాంటి ఇద్దరు డేంజర్ ప్లేయర్లను కావాలని డిమాండ్ చేస్తోందట రాజస్థాన్ రాయల్స్.
కానీ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట చెన్నై సూపర్ కింగ్స్. దానికి బదులుగా జడేజాతో పాటు సామ్ కర్రాన్ ( Sam Curran) లాంటి ఆల్ రౌండర్ ను ఇస్తామని ఆఫర్ చేస్తోందట చెన్నై. జడేజా, సామ్ కర్రాన్ ను ఇస్తే సంజును ఇవ్వాలని మెలిక పెట్టిందట సీఎస్కే. అయినా కూడా తగ్గని రాజస్థాన్, జడేజాతో పాటు మతీషా పతిరనా ఇస్తే సంజును ఇస్తామని చెబుతోందట. దీనిపై చెన్నై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. కానీ మొత్తానికి జడేజాను వదిలించుకోవాలని చెన్నై చూస్తోందని టాక్. దీంతో జడేజాను వదిలేయవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.






