రొనాల్డో డబుల్.. 3-0తో అల్ నాజర్ అద్భుత విజయం

by Phanindra |

సౌదీ ప్రీమియర్ లీగ్‌లో రొనాల్డో డబుల్ గోల్స్ చేశాడు. దీంతో 3-0తో అల్ నాజర్ అద్భుత విజయం సాధించింది.

రొనాల్డో డబుల్.. 3-0తో అల్ నాజర్ అద్భుత విజయం
X

దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. సౌదీ ప్రీమియర్ లీగ్‌లో అల్ అఖ్‌దూద్‌తో జరిగిన మ్యాచులో ఈ అల్-నాజర్ స్టార్ రెండు గోల్స్‌తో మెరిశాడు. అతనితోపాటు జావో ఫీలిక్స్ కూడా గోల్ చేయడంతో ఈ టీం 3-0తో అద్భుత విజయం సాధించింది. ఈ విక్టరీతో పాయింట్ల పట్టికలో అల్-నాజర్ పది మ్యాచుల్లో 30 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ బ్రేస్ (రెండు గోల్స్)తో రొనాల్డో కెరీర్ గోల్స్ సంఖ్య 956కు చేరింది. ఇది మరో లెజెండ్ లియోనెల్ మెస్సీ కన్నా 60 ఎక్కువ కావడం గమనార్హం. కాగా, మెస్సీ ప్రస్తుతం మేజర్ లీగ్ సాకర్‌లో ఇంటర్ మియామీ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.

Next Story