ఒక్కసారి కూడా స్టంపౌట్ కాక ముందు వేల రన్స్ చేసిన ప్లేయర్లు వీరే..!

by Disha Web Desk 12 |
ఒక్కసారి కూడా స్టంపౌట్ కాక ముందు వేల రన్స్ చేసిన ప్లేయర్లు వీరే..!
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్ట్ క్రికెట్ చరిత్రలో జో రూట్ రికార్డ్ సృష్టించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ మొదటి యాషెస్ 2023 టెస్టులో 4వ రోజు స్టంపౌట్ అయ్యాడు. రూట్ తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో దాదాపు 11,168 పరుగుల అనంతరం నిన్న మొదటి సారి స్టంపౌట్ అయ్యాడు. దీంతో రూట్ మొదటి సారి స్టంపౌట్ అయ్యే ముందు అత్యధిక టెస్టు పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా వెస్టిండీస్‌ మాజీ బ్యాటర్‌ శివనారాయణ్‌ చందర్‌పాల్‌ 11,414 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. గ్రేమ్ స్మిత్ (8,800 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ.. 8,195 పరులతో నాలుగో స్థానంలో ఉండగా, సచిన్ టెండూల్కర్ 7,419 పరుగుల వద్ద రనౌట్ అయి ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

Read more : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య.. రూ.5 లక్షలు డిమాండ్

Next Story

Most Viewed