- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్దంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్రికెటర్ అంబటి రాయుడిపై తీవ్ర విమర్శలు
భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) చేసిన ట్వీట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఐపీఎల్ 2025 లో భాగంగా ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ రద్దు అయింది. మ్యాచ్ రద్దు తర్వాత అంబట రాయుడు (An Eye for an Eye Makes the World Blind) "కంటికి కన్ను ప్రపంచాన్ని అంధుడిని చేస్తుంది అని ట్వీట్ చేశాడు. అయితే రాయుడు మ్యాచ్ రద్దు ను ఉద్దేశించి, పాకిస్తాన్ పై భారత్ కౌంటర్ ఎటాక్ సమయంలో వివాదాస్పద ట్వీట్ (controversial tweet) చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీంతో అంబటి రాయుడిని 'దేశద్రోహి' అని పిలుస్తు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
కాగా కొద్ది సేపటికే తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన రాయుడు.. తన పోస్ట్‌పై క్లారిటీ (Clarity) ఇస్తూ మరో ట్వీట్ చేశాడు. అందులో " దేశభక్తి శాంతి కోసం పిలుపునిస్తూ చేయి చేయి కలిపి నడవగలదు. "కంటికి కన్ను మొత్తం ప్రపంచాన్ని అంధుడిని చేస్తుందని గుర్తుంచుకోండి. ఇది బలహీనత కాదు.. జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది. న్యాయం దృఢంగా నిలబడాలి, కానీ మానవత్వాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, సరిహద్దు వెంబడి భారత దేశంలోని ఇతర ప్రాంతాల్లో శాంతి, భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నాను. ప్రభావితమైన ప్రతి ఒక్కరికి బలం, భద్రత, త్వరిత పరిష్కారం కోసం ఆశిస్తున్నాను. జై హింద్, ”అని రాయుడు రాసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికి యుద్ధ పరిస్థితుల్లో భారత ఆర్మీకి మద్దతుగా నిలవాల్సిన వ్యక్తి ఇలాంటి ట్వీట్లు చేయడంతో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే అంబటి రాయుడిని వెంటనే జనసేన పార్టీ నుంచి తొలగించాలనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతుంది.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






