మెస్సితో కలిసి ఫుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి మనవడు

by velandi.Saikiran |   (  Updated:2025-12-13 17:46:29  IST  )

ఉప్ప‌ల్ లో ఫ్రెండ్లీ మ్యాచ్ లో కూడా లియోనెల్ మెస్సి పాల్గొని మంచి ట్రీట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా

మెస్సితో కలిసి ఫుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి మనవడు
X

దిశ‌, వెబ్ డెస్క్ : దిగ్గ‌జ ఫుట్ బాల్ ఆట‌గాడు లియోనెల్ మెస్సి ప్ర‌స్తుతం భార‌త్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌నివారం ఉద‌యమే భార‌త గ‌డ్డ‌పై ప్ర‌త్యేక విమానంలో అడుగుపెట్టారు మెస్సి. మొద‌ట కోల్‌క‌తాలో ప‌ర్య‌టించిన లియోనెల్ మెస్సి, శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా లియోనెల్ మెస్సికి ప్ర‌త్యేక ఆహ్వానం ప‌లికింది తెలంగాణ‌లోని రేవంత్ స‌ర్కార్‌.

ఇక ఇందులో భాగంగానే ఉప్ప‌ల్ లో ఫ్రెండ్లీ మ్యాచ్ లో కూడా లియోనెల్ మెస్సి పాల్గొని మంచి ట్రీట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా సంద‌డి చేశారు. ఓ గోల్ చేసి, శ‌భాష్ అనిపించారు రేవంత్‌. అయితే, ఈ మ్యాచ్ పూర్త‌యిన త‌ర్వాత‌, సీఎం రేవంత్ రెడ్డి మ‌నువ‌డు రుద్రదేవ్ కూడా మెస్సితో ఫుట్ బాల్ ఆడారు. ఈ సంఘ‌ట‌న కూడా వైర‌ల్ గా మారింది. ఈ మ్యాచ్ పూర్తయిన త‌ర్వాత ఫలక్‌నుమా ప్యాలెస్ కు వెళ్లారు. ఇవాళ రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్ లోనే మెస్సి బ‌స చేయ‌నున్నారు. రేపు ముంబైకి ప‌య‌నం అవుతారు. క్లిక్

Next Story