IND VS PAK: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఆసియా కప్‌..మ్యాచ్ ఆడొద్దంటూ లక్షల్లో పోస్టులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-14 04:07:55  IST  )

నేడు జ‌ర‌గ‌నున్న ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ బైకాట్ చేయాలంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దేశ‌భ‌క్తిని చాటుకోవాల‌ని ఇండియా పాక్ మ్యాచ్ కు ఎవ‌రూ వెళ్ల‌వ‌ద్ద‌ని, టికెట్ల‌ను కొనుగోలు చేయ‌వ‌ద్ద‌ని నెటిజ‌న్లు ట్వీట్లు వేస్తున్నారు.

IND VS PAK: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఆసియా కప్‌..మ్యాచ్ ఆడొద్దంటూ లక్షల్లో పోస్టులు
X

దిశ, వెబ్ డెస్క్: నేడు జ‌ర‌గ‌నున్న ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ బైకాట్ చేయాలంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దేశ‌భ‌క్తిని చాటుకోవాల‌ని ఇండియా పాక్ మ్యాచ్ కు ఎవ‌రూ వెళ్ల‌వ‌ద్ద‌ని, టికెట్ల‌ను కొనుగోలు చేయ‌వ‌ద్ద‌ని నెటిజ‌న్లు ట్వీట్లు వేస్తున్నారు. ప‌హ‌ల్గామ్ దాడిలో భార‌త‌యుల‌ను టార్గెట్ చేసి ప్రాణాలు తీసిన నేప‌థ్యంలో అస‌లు ఆ దేశంతోనే ఇండియా టీమ్ క్రికెట్ ఆడ‌వ‌ద్ద‌ని కోరుతున్నారు. బీసీసీఐ ప్ర‌జ‌ల మ‌నోభావాలు ప‌ట్టించుకోకుండా కేవ‌లం డ‌బ్బుల కోసమే మ్యాచ్ ఆడుతోంద‌ని విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడ‌టం వ‌ల్ల ఆ దేశానికి ఆదాయం వ‌స్తుంద‌ని, దానిని ఉగ్రవాదానికి ఖర్చు చేసి మనదేశంపైనే దాడి చేస్తారని మండిపడుతున్నారు. అసలు టీవీలో కూడా చూడవద్దని ఇండియా గెలిచినా ఎవరూ కనీసం శుభాకాంక్షలు చెప్పకూడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ మ్యాచ్ ఆడిపించినా భారతీయులుగా మనం మాత్రం మ్యాచ్ చూడవద్దని పోస్టులు పెడుతున్నారు. క్రికెట్ కంటే జాతీయవాదం గొప్పదని అంటున్నారు. బైకాట్ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటూ కేవ‌లం ట్విట్ట‌ర్ లోనే ఇప్ప‌టి వ‌ర‌కు 53వేలకు పైగా పోస్టులు పెట్టారు. ఇత‌ర సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ బైకాట్ చేయాలంటూ ట్రెండ్ చేస్తున్నారు.

ఇండియా పాక్ మ్యాచ్ బైకాట్ ఎందుకు?

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిలో 26మంది భార‌తీయుల‌ను కాల్చి చంపిన సంగ‌తి తెలిసిందే. దీనికి నిర‌స‌న‌గా ఆ దేశంతో క్రికెట్ ఆడ‌వ‌ద్ద‌ని గ‌త కొద్దిరోజులుగా దేశంలో చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌హ‌ల్గామ్ దాడిలో మ‌ర‌ణించిన బాధిత కుటుంబాలు సైతం మ్యాచ్ ఆడ‌వ‌ద్ద‌ని కోరుకున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా నేడు దుబాయ్ లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతోంది. మరి బైకాట్ వేళ ఈ మ్యాచ్‌‌పై ఎంత ప్రభావం పడుతుందో చూడాలి.

Next Story