- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ నిరీక్షణకు తెర.. చారిత్రాత్మక పతకం కైవసం
వరల్డ్ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత్ చరిత్ర సృష్టించింది.

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత్ చరిత్ర సృష్టించింది. టోర్నీ చరిత్రలోనే చారిత్రాత్మక తొలి పతకం సాధించింది. గువహతి వేదికగా జరుగుతున్న టోర్నీలో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. గురువారం సెమీస్‌కు వెళ్లడంతో మెడల్ ఖాయమైన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం జరిగిన సెమీస్‌లో ఇండోనేషియా చేతిలో ఓడిపోవడంతో కాంస్య పతకంతోనే సరిపెట్టాల్సి వచ్చింది. టోర్నీలో ఆరంభం నుంచి సత్తాచాటిన యువ భారత్‌కు ఇండోనేషియా చెక్ పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ 45-35, 45-21 తేడాతో విజయం సాధించింది. తొలి గేములో భార్గవ్ రామ్-విశ్వ తేజ్ జోడీ గెలుపుతో భారత్‌కు శుభారంభమే దక్కింది. కానీ, సింగిల్స్ గేమ్సులో ఉన్నతి హుడా, రౌనక్ చాహౌన్ ఓడిపోవడంతో తొలి సెట్ చేజారింది. ఇక, రెండో సెట్‌లోకూ భారత యువ షట్లర్లు మ్యాజిక్ చేయలేకపోయారు. దీంతో రెండు సెట్లలోనే భారత్ ఓటమి ఖాయమైంది. అయినప్పటికీ చారిత్రాత్మక కాంస్యం గెలవడం భారత జూనియర్ బ్యాడ్మింటన్‌లో ప్రత్యేకమైనదే.






