నేను చూసిన బెస్ట్ టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్

by Phanindra |

తాను చూసిన బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇదేనని ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. సిరాజ్ ఆటతీరును చాలా అభిమానిస్తానని చెప్పాడు.

నేను చూసిన బెస్ట్ టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్
X

దిశ, స్పోర్ట్స్: భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ తను చూసిన అత్యంత గొప్ప సిరీసుల్లో ఒకటని ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. అద్భుతంగా సాగిన ఈ ఐదు టెస్టు సిరీస్ చివరకు 2-2తో డ్రాగా ముగిసింది. ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఉత్కంఠ భరిత విక్టరీ సాధించిన భారత్.. సిరీస్ సమం చేసుకుంది. దీని గురించి మాట్లాడిన మెకల్లమ్.. ‘నేను ఆడిన, చూసిన బెస్ట్ ఐదు టెస్టుల సిరీస్ ఇదే.

ఆ ఆరు వారాల్లో చివరి వరకు విజయం ఎవరిదని చెప్పలేని పరిస్థితులు కనిపించాయి. ఒక టెస్టు సిరీసులో ఏమేం ఉండాలనుకుంటామో ఆ అంశాలన్నీ ఈ సిరీసులో కనిపించాయి’ అని మెకల్లమ్ చెప్పాడు. ‘కొన్నిసార్లు గొడవ పడేలా కనిపించారు. మరికొన్నిసార్లు స్నేహం, ఇంకోసారి అద్భుతమైన క్రికెట్, మరోసారి ఒత్తిడిలో చాలా సాధారణ క్రికెట్.. ఇవన్నీ కనిపించాయి.

ఈ సిరీస్ కష్టంగా ఉంటుందని, టీమిండియా మమ్మల్ని ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో పరీక్షలు పెడుతుందని మాకు ముందే తెలుసు. అయితే రెండు జట్లు కూడా ఆశించిన దానికంటే ఎక్కువ పరీక్షలే ఎదుర్కొన్నాయి’ అని వివరించాడు. ఇక చివరి మ్యాచులో చివరి రోజు మహమ్మద్ సిరాజ్ స్పెల్ అద్భుతమని మెకల్లమ్ కొనియాడాడు.

సిరాజ్ చివరి వికెట్ తీసినప్పుడు ఎంతో డిజప్పాయింట్ అయ్యానని, కానీ ఓవరాల్‌గా ఇదొక క్రాకింగ్ సిరీస్ అని మెచ్చుకున్నాడు. అలాగే సిరాజ్ అంటే తనకు ఎంతో అభిమానం ఉందని, ఒక క్రికెటర్‌గా తనలో ఉన్న పోటీతత్వం తనకెంతో ఇష్టమని చెప్పిన మెకల్లమ్.. ఇలాంటి ప్రదర్శనలు చేయడం అంత ఈజీ కాదన్నాడు.

Next Story