టీ20 ప్రపంచ కప్ వేళ బిగ్ అప్‌డేట్.. జట్టును ప్రకటించిన స్కాట్లాండ్

by Kema Shiva Kumar |

భారత్, శ్రీలంక వేదికలుగా త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న విషయం తెలిసిందే.

టీ20 ప్రపంచ కప్ వేళ బిగ్ అప్‌డేట్.. జట్టును ప్రకటించిన స్కాట్లాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ (India), శ్రీలంక (Srilanka) వేదికలుగా త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2026 (ICC Men's T20 World Cup 2026) నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న విషయం తెలిసిందే. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నిరాకరించడంతో, ఐసీసీ ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది. ఈ మెగా టోర్నీ కోసం స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ 15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో స్కాట్లాండ్ గ్రూప్-సి లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ జట్లతో తలపడనుంది.

స్కాట్లాండ్ టీ20 ప్రపంచ కప్ జట్టు ఇదే..

రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.

Next Story