- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంభీర్ బిగ్ షాక్...ప్రాక్టీస్‌కు సీనియర్లు డుమ్మా ?
మిగిలిన సీనియర్ భారత ప్లేయర్లు మాత్రం ప్రాక్టీస్ చేయలేదని తెలుస్తోంది. దీంతో గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్ల విజయం మధ్య గొ

దిశ, వెబ్ డెస్క్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ చిట్ట చివరి వన్డే మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం వేదికగా ఈ చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే రెండు జట్లు కూడా విశాఖపట్నం చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం రోజున ప్రాక్టీస్ చేయాలని గౌతమ్ గంభీర్ ఆదేశాలు ఇచ్చారట. ఈ తరుణంలో కొంత మంది భారత ప్లేయర్లు మాత్రమే ప్రాక్టీస్ చేసినట్లు చెబుతున్నారు. యశస్వి జైష్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ లాంటి నలుగురు ప్లేయర్లు మాత్రమే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేశారట.
మిగిలిన సీనియర్ భారత ప్లేయర్లు మాత్రం ప్రాక్టీస్ చేయలేదని తెలుస్తోంది. దీంతో గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్ల విజయం మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈ సమస్యను వెంటనే బీసీసీఐ పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే, భారత జట్టు మరింత ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా బీసీసీఐ తేరుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.






