- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు BIG అలర్ట్.. రేపు మీడియా ముందుకు హిట్‌మ్యాన్
టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు రాబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు రాబోతున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12 : 30 గంటలకు ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)తో కలిసి మీడియాతో మాట్లడబోతున్నారు. ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ( ICC Champions Trophy) టీమ్‌ను ప్రకటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కొన్ని రోజులుగా డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలంటూ వస్తోన్న పుకార్లు, సోషల్ మీడియా వార్తలపైనా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మీడియా సమావేశంలో కోచ్ గంభీర్ పాల్గొనే విషయంపై క్లారిటీ లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొనబోతున్నాయి.
నాలుగేసి జట్ల చొప్పును రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ దశలో 12 మ్యాచులుంటాయి. ఆ తర్వాత రెండు సెమీఫైనల్స్.. ఆ తర్వాత ఫైనల్ ఉంటుంది. భారత్-పాక్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 23న దుబాయిలో జరుగనున్నది. భారత్ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఆ తర్వాత పాకిస్థాన్‌తో.. మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనున్నది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మార్చి 8న జరుగనున్నది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.






