- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరు తొక్కిసలాట.. కీలక నిర్ణయం తీసుకోబోతున్న బీసీసీఐ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల వేళ పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల వేళ పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట వద్ద 11 మంది మృతి చెందారు. ఈ ఘటనను బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బోర్డు చర్యలు తీసుకోబోతోంది. ఇటీవల బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా తాము సైలెంట్‌గా ఉండలేమని, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ శనివారం జరగనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.ఈ సమావేశం వర్చువల్‌గా జరగనుంది. ప్రత్యేకంగా తొక్కిసలాట ఘటనపైనే చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిబంధనలను రూపొందించనున్నట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి. జట్ల వేడుకుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టు చెప్పాయి. విజయోత్సవ వేడుకల సందర్భంగా పాటించాల్సిన నియమ, నిబంధనలపై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించనున్నారు.
మార్గదర్శకాలపై మీటింగ్ తర్వాతే స్పష్టత రానుంది. అలాగే, దేశవాళీ సీజన్, సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌పై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు జరిగే ఈ సిరీస్ తేదీలు, వేదికలను ఖరారు చేయనున్నారు. ఇక, వచ్చే ఏడాదిలాగే దులీప్ ట్రోఫీతో దేశవాళీ సీజన్ ప్రారంభంకానుంది. ఈ మీటింగ్‌లో దేశవాళీ షెడ్యూల్‌కు ఆమోద ముద్ర పడాల్సి ఉంది.






