జడేజా, సుందర్ సెంచరీలు.. అక్కసు వెళ్లగక్కిన స్టోక్స్

by Harish |

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది.

జడేజా, సుందర్ సెంచరీలు.. అక్కసు వెళ్లగక్కిన స్టోక్స్
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. జడేజా, సుందర్ సెంచరీ చేరువైన సమయంలో స్టోక్స్ డ్రాను ప్రతిపాదించాడు. కానీ, అందుకు వారు అంగీకరించలేదు. జడేజా, సుందర్ శతకాలు పూర్తి చేసిన తర్వాత మ్యాచ్ డ్రా అయ్యింది. గెలుస్తామనుకున్న మ్యాచ్‌ డ్రా అవడం, డ్రాకు ప్రతిపాదించిన భారత్ అంగీకరించకపోవడంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు ఫ్రస్టేషన్‌కు గురయ్యారు. మైదానంలో స్టోక్స్ జడేజాకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్టోక్స్.. సుందర్, జడేజాలపై అక్కసు వెళ్లగక్కాడు. వారి ఆటను ప్రశంసిస్తూనే సెంచరీలకు విలువలేదన్నట్టు మాట్లాడాడు. ‘జడేజా, సుందర్ అద్భుతంగా ఆడారు. 80, 90 పరుగుల వద్ద నాటౌట్‌గా ఉండి క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును గట్టెక్కించడం కంటే సెంచరీలు చేయడం వారికి అంత సంతృప్తగా ఉండదని అనుకుంటున్నా. 10 పరుగులు జట్టును ఓటమి నుంచి బయటపడేశాయనే వాస్తవాన్ని మార్చలేవు. ఆఖరి మ్యాచ్‌కు ముందు సిరీస్ ఓటమి నుంచి మీ జట్టును కాపాడుకున్నారు.’అని స్టోక్స్ తెలిపాడు. తాము గెలుస్తామని ఆశ ఉన్నప్పుడు మెయిన్ బౌలర్లతో బౌలింగ్ చేయించానని, కానీ డ్రా తప్పదనుకున్నప్పుడు ఆలోచన మార్చుకున్నట్టు చెప్పాడు. సిరీస్ మొత్తం తమ బౌలర్ల వర్క్‌లోడ్ కారణంగా రిస్క్ తీసుకోవద్దని భావించినట్టు చెప్పాడు. అందుకే హ్యారీ బ్రూక్‌తో బౌలింగ్ చేయించినట్టు తెలిపాడు.


Next Story