- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీ, రోహిత్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ
భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బీసీసీఐ ట్విస్ట్ ఇచ్చింది.

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బీసీసీఐ ట్విస్ట్ ఇచ్చింది. తాము అసలు వారిని దేశవాళీ ఆడాలని ఆదేశించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రో–కో వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా టూరుతోపాటు సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఇద్దరూ సత్తాచాటిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే ఉద్దేశంతో ఉన్నారు. వన్డే ప్రణాళికల్లో ఉండాలంటే ఈ సీనియర్లు దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఇటీవల ఆదేశాలు జారీచేసినట్టు వార్తలు వచ్చాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వారిపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు రోహిత్, కోహ్లీ అంగీకరించారు. ఈ మేరకు ముంబై జట్టుకు రోహిత్, ఢిల్లీ జట్టుకు కోహ్లీ ఆడతామని ఇప్పటికే ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు తెలియజేసినట్టు కూడా కథనాలు వచ్చాయి. తాజాగా బీసీసీఐ వర్గాలు మాత్రం రోహిత్, కోహ్లీలపై తాము ఒత్తిడి తేలేదని చెప్పాయి. ‘విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని మేము వారిని ఆదేవించలేదు. అది వారి సొంత నిర్ణయం.’అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.






