- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ వేట.. రూ. 452 కోట్లు ఆర్జించాలని ప్లాన్
టీమ్ ఇండియా స్పాన్సర్‌షిప్ నుంచి డ్రీమ్ 11 తప్పుకున్న విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్పాన్సర్‌షిప్ నుంచి డ్రీమ్ 11 తప్పుకున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన కొత్త గేమింగ్ బిల్లు కారణంగా డ్రీమ్ 11 బీసీసీఐతో ఒప్పందం మరో ఏడాది ఉండగానే రద్దు చేసుకుంది. దీంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ అన్వేషణ మొదలుపెట్టింది. 2025 నుంచి 2028 వరకు మూడేళ్ల కాలానికి సంబంధించి టీమిండియా(పురుష, మహిళల జట్లు) జెర్సీ స్పాన్సర్‌షిప్ హక్కులను ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొత్త స్పాన్సర్ మొత్తం 140 మ్యాచ్‌లకు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. అందులో ద్వైపాక్షిక సిరీస్‌లతోపాటు ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లు ఉంటాయి. త్వరలో ప్రారంభం కాబోయే ఆసియా కప్‌లో భారత జట్టు జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగనుంది. అయితే, సెప్టెంబర్ 30లోగా బీసీసీఐ కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
2023-26 వరకు టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ హక్కుల డ్రీమ్ 11 కోసం రూ. 358 కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఆ డీల్ ప్రకారం.. డ్రీమ్ 11 ద్వైపాక్షిక మ్యాచ్‌లకు రూ. 3 కోట్లు, ఐసీసీ, ఆసియా కప్ మ్యాచ్‌లకు రూ. కోటి చెల్లించేది. ఈ సారి అంతకంటే ఎక్కువే ఆర్జించాలనే బీసీసీఐ ఆలోచిస్తుందట. కొత్త స్పాన్సర్‌షిప్ ద్వారా రూ. 452 కోట్లు లక్ష్యంగా పెట్టుకుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ద్వైపాక్షిక మ్యాచ్‌లకు రూ.3.5 కోట్లు, ఐసీసీ, ఆసియా కప్ మ్యాచ్‌లకు రూ.1.5 కోట్లుగా ఫిక్స్ చేసినట్టు తెలిపాయి. ఆ అంచనాల ఆధారంగా హక్కుల విలువ 2025-26కి రూ.131 కోట్లు, 2026-27కి రూ.162.5 కోట్లు, 2027-28కి రూ.158.5 కోట్లు దక్కనున్నాయి.






