పాకిస్తాన్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. ఆ ఇద్దరు ప్లేయర్లపై ఐసీసీకి ఫిర్యాదు

by Malleboina Mahesh |   (  Updated:2025-09-25 03:18:09  IST  )

ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్‌లో భాగంగా సెప్టెంబర్ 21న భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది.

పాకిస్తాన్ షాక్  ఇచ్చిన బీసీసీఐ.. ఆ ఇద్దరు ప్లేయర్లపై ఐసీసీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్‌లో భాగంగా సెప్టెంబర్ 21న భారత్–పాకిస్తాన్ (India–Pakistan) మధ్య జరిగిన మ్యాచ్‌లో వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఆటగాళ్లు హరిస్ రవూఫ్ (Haris Rauf), సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (Sahibzada Farhan)లు మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లను, అభిమానులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. వారి సెలబ్రేషన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో, పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రవర్తనపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో బీసీసీఐ (BCCI) ఐసీసీకి (ICC) అధికారిక ఫిర్యాదు (formal complaint) చేసింది. సూపర్ 4 మ్యాచ్‌లో రెచ్చగొట్టే హావభావాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బుధవారం వీరిద్దరిపై ఫిర్యాదు నమోదు చేసినట్లు సమాచారం. ఐసీసీ ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు అందుకున్నట్లు తెలిసింది. రవూఫ్, సాహిబ్‌జాదా ఈ ఆరోపణలను లిఖితపూర్వకంగా తిరస్కరించినా, ఐసీసీ విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో వారు ఎలైట్ ప్యానెల్ (Elite panel) రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ముందు హాజరుకావాల్సి ఉంటుంది.

Next Story