గంభీర్ - రోకో మ‌ధ్య వివాదం.. బీసీసీఐ అత్య‌వ‌స‌ర స‌మావేశం!

by velandi.Saikiran |

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్ల బలం చూసుకొని, గౌతమ్ గంభీర

గంభీర్ - రోకో మ‌ధ్య వివాదం.. బీసీసీఐ అత్య‌వ‌స‌ర స‌మావేశం!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత జట్టులో అంతర్గత కలహాలు తెరపైకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా గిల్ జట్టుకు దూరం కావడంతో, హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ను టార్గెట్ చేసి భారత ప్లేయర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారట. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో భారత ఆటగాళ్లు వన్డే సిరీస్ ఆడుతున్నారు. దీంతో సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్ల బలం చూసుకొని, గౌతమ్ గంభీర్ ను అస్సలు పట్టించుకోవడంలేదట భారత ప్లేయ‌ర్లు. దానికి తగ్గట్టుగానే గంభీర్‌ను టార్చర్ పెడుతున్నారట కోహ్లీ, రోహిత్.

మొన్న దక్షిణాఫ్రికా పై జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కూడా సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ, పరోక్షంగా గంభీర్ కు వార్నింగ్ ఇచ్చినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అటు రోహిత్ శర్మ కూడా డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్ ను దారుణంగా తిట్టినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ వివాదాల నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతుందట బీసీసీఐ. భారత జట్టులో జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చించబోతున్నారట. క్రమశిక్షణగా ఉండాలని ప్లేయర్లకు ఈ మీటింగ్ ద్వారా దిశా నిర్దేశం చేయబోతున్నారట బీసీసీఐ పెద్దలు. అటు గంభీర్ కు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. సొంత గడ్డపై భారత జట్టు మ‌ళ్లీ సిరీస్ కోల్పోతే, ఇకపై గంభీర్ దే బాధ్యత అన్నట్లుగా బీసీసీఐ కొత్త ప్రెషర్ పెట్టబోతుందట.

Next Story