టీమిండియా వర్సెస్ బంగ్లా సిరీస్ వాయిదా.. మళ్లీ ఎప్పుడు అంటే ?

by velandi.Saikiran |

రోహిత్ శర్మ ( Rohit Sharma) అలాగే విరాట్ కోహ్లీ లను (Virat Kohli) గ్రౌండ్ లో చూడాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది.

టీమిండియా వర్సెస్ బంగ్లా సిరీస్ వాయిదా.. మళ్లీ ఎప్పుడు అంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: రోహిత్ శర్మ ( Rohit Sharma) అలాగే విరాట్ కోహ్లీ లను (Virat Kohli) గ్రౌండ్ లో చూడాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది. టీమిండియా ( Team India) వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh) మధ్య వైట్ బాల్ సిరీస్ (white-ball series) వాయిదా పడింది. వాస్తవానికి ఈ సంవత్సరం ఆగస్టు మాసంలో టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వైట్ బాల్ సిరీస్ జరగాల్సి ఉండేది. కానీ ఆ సిరీస్ తాజాగా వాయిదా పడినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) అధికారికంగా ప్రకటించింది.

ఈ సిరీస్ ను మళ్లీ 2026 సెప్టెంబర్ మాసంలో... నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అంటే సరిగ్గా మరో ఏడాది తర్వాత ఈ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకుంటున్నారు. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు దీనికి అంగీకారం తెలిపాయని కూడా ప్రకటన విడుదలైంది. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య 3 వన్డేలు అలాగే మూడు టి20 సిరీస్ లు జరగాల్సి ఉంది. కానీ భద్రతా కారణాలవల్ల... ఈ సిరీస్ రద్దయినట్లు తెలుస్తోంది.

Twitter Link

Next Story