- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్ల్యూపీఎల్-2026పై బీసీసీఐ అప్‌డేట్.. టోర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసా?
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)-2026 విండో, వేదికలను బీసీసీఐ గురువారం ఖరారు చేసింది.

దిశ, స్పోర్ట్స్ : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)-2026 విండో, వేదికలను బీసీసీఐ గురువారం ఖరారు చేసింది. జనవరి 9 నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 5న ఫైనల్ జరగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు డబ్ల్యూపీఎల్ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్నది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ విండోను బోర్డు ముందుకు జరిపింది. అలాగే, ఈ ఏడాది నాలుగు వేదికల్లో(ముంబై, వడోదర, బెంగళూరు, లక్నో) మ్యాచ్‌లు జరగగా.. ఈ సారి రెండు వేదికలకే టోర్నీని పరిమితం చేసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, వడోదరలోని బీసీఏ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నట్టు బోర్డు వెల్లడించింది. జనవరి 9న నవీ ముంబైలో ఓపెనింగ్ మ్యాచ్ జరగనుండగా.. ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్‌కు వడోదర ఆతిథ్యమిస్తుంది. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.






