- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BCCI: ఒక శకం ముగిసింది.. బీసీసీఐ సంచలన ట్వీట్
రన్ మిషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) క్రికెట్ లవర్స్‌కు ఊహించని షాకిచ్చాడు.

దిశ, వెబ్‌డెస్క్: రన్ మిషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) క్రికెట్ లవర్స్‌కు ఊహించని షాకిచ్చాడు. తాను టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగతున్నట్లుగా ఇవాళ ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో సుదీర్ఘ భావోద్వేగభరిత పోస్ట్ చేశాడు. అయితే, ఇటీవలే రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పగా.. విరాట్ కూడా అదే నిర్ణయం తీసుకుంటాడని సోషల్ మీడియాలో జోరుగా వార్తలొచ్చాయి. అనకున్నట్లుగా ఆ వార్తలను నిజం చేస్తూ ఇవాళ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పడకడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం టెస్ట్ కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ భారత్ తరఫున అత్యంత సక్సెస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. విరాట్ సారథ్యంలో 68 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 2016-2019 మధ్యకాలంలో టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. కోహ్లీ 43 టెస్ట్ మ్యాచ్‌ల్లో 66.79 సగటుతో 4,208 పరుగులు చేశాడు. కోహ్లీ 69 ఇన్నింగ్స్‌లలో 16 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు చేశాడు.
విరాట్ కోహ్లీ టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన తరుణంలో బీసీసీఐ (BCCI) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేసింది. ‘విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒక గొప్ప విజయంగా 2018–19 సీజన్‌లో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్‌ను అప్రతిహతంగా కైవసం చేసుకున్నాం. అది 71 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు సాధించిన తొలి టెస్ట్ సిరీస్ విజయంగా నిలిచింది.. ఒక శకం ముగిసింది’ అంటూ బీసీసీఐ (BCCI) ట్వీట్ చేసింది.






