పీక‌ల్లోతు క‌ష్టాల్లో బంగ్లాదేశ్‌...సిరీస్ న్యూజిలాండ్ కే ద‌క్క‌నుందా !

by velandi.Saikiran |

న్యూజిలాండ్ తో జ‌రుగుతోన్న మూడో వ‌న్డేలో పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది బంగ్లాదేశ్‌.

పీక‌ల్లోతు క‌ష్టాల్లో బంగ్లాదేశ్‌...సిరీస్ న్యూజిలాండ్ కే ద‌క్క‌నుందా !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఒకవైపు ఐపీఎల్ 2026 కొనసాగుతుండగా మరోవైపు బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ కీలక ఆటగాళ్లతో బరిలోకి దిగితే, న్యూజిలాండ్ మాత్రం A క్లాస్ ప్లేయ‌ర్ల‌తో ఆడుతోంది. అయినప్పటికీ ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న వన్డేల్లో అద్భుతంగా రాణిస్తోంది న్యూజిలాండ్. ఫస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలవగా, రెండో వ‌న్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించింది.

ఇక ఇవాళ చ‌ట్టోగ్రామ్ వేదికగా ఈ రెండు జట్లు మూడో వన్డేలో తలపడ‌నున్నాయి. ఇందులో టాస్ ఓడిపోయి బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే 31 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ పరుగులు చేసేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని అంటున్నారు. అదే జరిగితే, 2-1 తేడాతో బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ గెలవనుంది న్యూజిలాండ్. ఇంకా ఈ వన్డే సిరీస్ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 27వ తేదీ నుంచి 3 టీ20ల సిరీస్ ప్రారంభం అవుతుంది.

Next Story