బంగ్లా క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం

by Ajay Maddhiboyina |

2023 ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు ఆమె ఫిక్సింగ్‌లో ఇన్వాల్వ్ అయినట్లు ఐసీసీ గుర్తించింది.

బంగ్లా క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
X

- షొహేలీ అక్తర్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

- టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు ఫిక్స్?

- కఠిన చర్యలు తీసుకున్న ఐసీసీ

దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ షొహేలీ (34) అక్తర్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఐదేళ్ల నిషేధం విధించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి ఆమె ఐదేళ్ల పాటు దూరంగా ఉండాలని ఐసీసీ ఆదేశించింది. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ కింద చర్యలు తీసుకున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. 2023లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన మహిళా టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన షొహేలీ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2023లో జమునా టీవీలో ఇద్దరు క్రికెటర్లు మాట్లాడుకున్న ఆడియో క్లిప్ ప్రసారం అయ్యింది. వరల్డ్ కప్ జరిగే సమయంలో షొహేలీ అక్తర్‌ను బంగ్లాదేశీ క్రికెట్ లతా మొండల్ కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను అప్పట్లో షొహేలీ ఖండించింది. తాను సోషల్ మీడియాలో ఒక ఫ్రెండ్‌తో కనెక్ట్ అయ్యాను. ఆ సమయంలో వాడి వేడి వాదోపవాదాలు జరిగాయి. దీంతో ఈ విషయాలను బంగ్లాదేశ్ టీమ్ మేట్స్‌తో పంచుకున్నాను. కానీ వాళ్లు బీసీబీ యాంటీ కరప్షన్ యూనిట్‌కు తెలియజేశారని షొహేలీ అక్తర్ చెబుతోంది. 2023 ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు ఆమె ఫిక్సింగ్‌లో ఇన్వాల్వ్ అయినట్లు ఐసీసీ గుర్తించింది. సోషల్ మీడియాలో ఒక బంగ్లా క్రికెటర్‌ను ఫిక్సింగ్ చేయమని ప్రోత్సహించినట్లు తెలిసింది. అయితే సదరు క్రికెటర్ ఫిక్సింగ్ చేయడానికి ఒప్పుకోలేదని.. ఆ తర్వాత యాంటీ కరప్షన్ యూనిట్‌కు ఫిర్యాదు చేసిందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ విచారణలో ఫిక్సింగ్‌కు ప్రయత్నించినట్లు తేలడంతో పలు నిబంధనల కింద ఆమెపై 5 ఏళ్ల నిషేధం విధించింది.

Next Story