- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నీళ్లు పెట్టుకున్న ఆవేశ్ తల్లి... ఎమోషనల్ వీడియో వైరల్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( I PL 2025) భాగంగా... ఓ అరుదైన సంఘటన జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( I PL 2025) భాగంగా... ఓ అరుదైన సంఘటన జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants) బౌలర్ ఆవేశ్ ఖాన్ ( Avesh Khan) తల్లి కంటతడి పెట్టుకుంది. లక్నో బౌలర్.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ వేసిన నేపథ్యంలో.. ఆ జట్టు విజయం సాధించింది. దీంతో... ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర బాగోద్వేగానికి లోనయ్యారు. ఆవేశ్ ఖాన్ ను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా తాజాగా రాజస్థాన్ రాయల్స్ ( RR) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( LSG ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్... చివరి క్షణంలో విజయం సాధించింది. రెండు పరుగుల తేడాతో మాత్రమే గెలుపొందింది లక్నో. చివరి ఓవర్ అవేశ్ ఖాన్ వేయడంతో... లక్నోకు కలిసి వచ్చింది. చివరి ఓవర్ లో తక్కువ పరుగులు ఇవ్వడం.. ప్లస్ అయింది. ఈ నేపథ్యంలోనే లక్నో బౌలర్ ఆవేశ్ ఖాన్ రియల్ హీరో అయిపోయాడు.
గతంలో కూడా ఆవేష్ ఖాన్ ఇలాంటి స్పెల్స్ (Spell) చాలానే వేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ పైన నాలుగు ఓవర్లు వేసిన ఆవేశ్ ఖాన్.. నాలుగు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం... తన కుటుంబ సభ్యులను కలిశాడు ఆవేశ్ ఖాన్. స్టేడియంలో కూర్చొని మ్యాచ్ తిలకించిన ఆవేశ్ ఖాన్ ( Avesh Khan) కుటుంబ సభ్యులు... అనంతరం అతన్ని.. కలిశారు. ఈ సందర్భంగా లక్నో బౌలర్ ఆవేశ్ ఖాన్ తల్లి తన కొడుకును హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం కుటుంబ సభ్యులకు కూడా ఎమోషనల్ అయ్యారు.






