- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AUS VS WI: తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం
ఆస్ట్రేలియా టీం సరికొత్త చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ పై తొలి టెస్ట్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆస్ట్రేలియా. మొదట

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా టీం సరికొత్త చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ పై తొలి టెస్ట్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆస్ట్రేలియా. మొదట తడబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకొని... వెస్టిండీస్ జట్టును చిత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో 159 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ జట్టు తడబడింది.
ఈ తరుణంలోనే 141 పరుగులకే వెస్టిండీస్ ఆల్ అవుట్ అయింది. వెస్టిండీస్ జట్టులో షమర్ జోసఫ్ ఒక్కడే 44 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హేజిల్ వుడ్ ఒక్కడే 5 వికెట్లు తీసి దుమ్ము లేపాడు. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన హెడ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.






