- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్డేల్లో 400కు పైగా పరుగులు చేసిన జట్లు ఇవే..లిస్టులో టీమిండియానే టాప్!
ఏడుసార్లు 400కు పైగా టీమిండియా స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఆరుసార్లు చేయగా.. ఆస్ట్రేలియా మూడుసార్లు

దిశ, వెబ్ డెస్క్: వన్డే క్రికెట్ చరిత్రలో ఇవాళ మరో అరుదైన రికార్డు నమోదయింది. వన్డేలలో 400కు పైగా స్కోర్ మరోసారి నమోదయింది. ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మూడవ వన్డే మ్యాచ్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.... నిర్ణీత 50 ఓవర్లలో... రెండు వికెట్లు నష్టపోయి 431 పరుగులు చేసింది.
ఇందులో ట్రావిస్ హెడ్ 142 పరుగులు చేయగా... మిచెల్ మార్ష్ 100 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఆ తర్వాత గ్రీన్ 118 పరుగులు చేయగా అలెక్స్ 50 పరుగులతో రాణించాడు. దీంతో వన్డేలలో 400 కు పైగా పరుగులు చేసిన ఆస్ట్రేలియా... నాలుగో స్థానంలో నిలిచింది. 400కు పైగా వన్డేలలో అత్యధిక సార్లు పరుగులు చేసిన జట్టుగా మొదటి స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉంది.
ఏకంగా 8 సార్లు సౌత్ ఆఫ్రికా 400 పైగా పరుగులు చేసింది. ఆ తర్వాత లిస్టులో టీమిండియా ఉంది. ఏడుసార్లు 400కు పైగా టీమిండియా స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఆరుసార్లు చేయగా.. ఆస్ట్రేలియా మూడుసార్లు ఈ రికార్డు సృష్టించింది. అనంతరం శ్రీలంక రెండుసార్లు, న్యూజిలాండ్ రెండుసార్లు, జింబాబ్వే ఒకసారి ఈ చరిత్ర సృష్టించింది.
Instagram post credit to Sportskeeda Cricket Instagram page






