టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే

by velandi.Saikiran |   (  Updated:2025-10-31 08:11:51  IST  )

టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగనుంది. మొన్న మొదటి టి20 సమయంలో కూడా టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య మరికాసేపట్లోనే రెండో టి20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సూర్య కుమార్ యాదవ్ మరోసారి టాస్ ఓడిపోయాడు. టీమిండియా టాస్ ఓడిపోయిన నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగనుంది. మొన్న మొదటి టి20 సమయంలో కూడా టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ పిచ్ లో మొదట బౌలింగ్ చేసిన జట్టు విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ వర్షం పడినా కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్లకు అడ్వాంటేజ్ ఉంటుందట. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు: మిచెల్ మార్ష్ (C), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (wK), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్ జట్టులో ఉంటారు.

టీమిండియా తుది జ‌ట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్ (wk), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

Next Story