రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌..ఇక అదే చివ‌రి మ్యాచ్‌

by velandi.Saikiran |

ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ సంచలన ప్రకటన చేశారు. తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు.

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌..ఇక అదే చివ‌రి మ్యాచ్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌:ఆస్ట్రేలియా ( Australia ) ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ ( Alyssa Healy ) సంచలన ప్రకటన చేశారు. తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ( Alyssa Healy retire) ఇస్తున్నట్లు వెల్లడించారు. మార్చి నెలలో భారత జట్టుతో జరగబోయే హోం సిరీస్ తర్వాత, అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు వీడియో ద్వారా వెల్లడించారు. తన వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యల కారణంగా రిటైర్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు.

35 సంవత్సరాల వయసులో కూడా ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టింది అలీసా హీలీ. కానీ తనలో ఇప్పుడు పోటీ తత్వం పూర్తిగా తగ్గిపోయిందని కూడా పేర్కొంది. కాగా దాదాపు 15 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అలీసా హీలీ, ఇప్పటి వరకు 300 మ్యాచ్ లు ఆడారు. మహేంద్ర సింగ్ ధోనీ లాగా వికెట్ కీపింగ్ తో పాటు కెప్టెన్సీ చేస్తున్నారు. ఇక తన కెరీర్ లో ఇప్పటి వరకు 7వేలకు పైగా పరుగులు సాధించారు. 275 మందిని అలీసా హీలీ ఔట్ చేశారు.

Next Story