- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పసికూన స్కాట్లాండ్.. ఆసీస్ తో సిరీస్ ప్రకటన !
యూకే పర్యటనలో భాగంగా.. సెప్టెంబరులో పసికూన స్కాట్లాండ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.

దిశ, వెబ్ డెస్క్: యూకే పర్యటనలో భాగంగా.. సెప్టెంబరులో పసికూన స్కాట్లాండ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెప్టెంబర్ 4 నుండి 7 వరకు ఆసీస్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. స్కాట్లాండ్ కూడా 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. స్కాట్లాండ్ జట్టు సారథిగా రిచీ బెరింగ్ టన్ వ్యవహరించనున్నారు. అయితే టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. స్కాట్లాండ్ జట్టులో స్టార్ ఆటగాళ్లు జార్జ్ మున్సే, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్ ఎంపికయ్యారు. వీరందరూ ఇటీవలే వెస్టిండీస్ వేదికగా ముగిసిన టీ20 లో ముఖ్య పాత్ర పోషించారు. ఈ సందర్భంలో ప్రధాన కోచ్ గా డౌగ్ వాట్సన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో పోటీ పడడం తమకు ఎంతో చక్కని అవకాశమని అన్నారు.
ఆస్ట్రేలియాతో టీ20 స్కాట్లాండ్ జట్టు:
రిచీ బెరింగ్ టన్(కెప్టెన్), చార్లీ కాసెల్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, జాస్పర్ డేవిడ్ సన్, క్రిస్ గ్రీవ్స్, జాక్ జార్వీస్, ఓలీ హెయిర్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెకముల్లెన్, జార్జ్ మున్సేన్, సఫయాన్ షరీఫ్, క్రిస్ సోల్, బ్రాడ్లీ వీల్.






