- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AUS vs SA : మ్యాక్స్వెల్ సూపర్ ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియాదే టీ20 సిరీస్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరోటి గెలవడంతో సిరీస్ ఫలితం మూడో టీ20లో తేలింది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించడంతోపాటు 2-1తో సిరీస్ విజయం సాధించింది. గ్లెన్ మ్యాక్స్వెల్(62 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి మూడో టీ20లో ఆసిస్కు విజయాన్ని కట్టబెట్టాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ మరోసారి చెలరేగాడు. 200కిపైగా స్ట్రైక్రేటుతో ఆడిన 26 బంతుల్లో 53 రన్స్ చేశాడు. డస్సెన్(38 నాటౌట్), ప్రిటోరియస్(24), స్టబ్స్(25) విలువైన రన్స్ జోడించారు. దీంతో సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియా ముందు 173 పరుగుల టఫ్ టార్గెట్ పెట్టింది.
ఛేదనలో ఆసిస్ కూడా తీవ్రంగా కష్టపడింది. ముందుగా మిచెల్ మార్ష్(54) రాణించడంతో ఆ జట్టుకు శుభారంభమే దక్కింది. పవర్ ప్లే తర్వాత ఆ జట్టు తడబడింది. హెడ్(19), జోష్ ఇంగ్లిస్(0), గ్రీన్(9), టిమ్ డేవిడ్(17), ఆరోన్ హార్డీ(1) నిరాశపర్చడంతో ఆసిస్ 122/6 పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మ్యాక్స్వెల్ అసాధారణ పోరాటం చేశాడు. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా అతను మాత్రం ఏ మాత్రం పోరాటం ఆపలేదు. 36 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. మరో బంతి మిగిలి ఉండగానే ఆసిస్ 8 వికెట్లు కోల్పోయి విజయ తీరాలకు చేరింది.






