- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసిస్ బౌలర్లను ఊచకోతకోసిన డెవాల్డ్ బ్రెవిస్.. సౌతాఫ్రికా భారీ విజయం
సౌతాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించాడు.

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన రెండో టీ20లో మెరుపు శతకంతో ఊచకోతకోశాడు. దీంతో సౌతాఫ్రికా 53 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను బ్రెవిస్ ఒక్కడే నడిపించాడు. టాపార్డర్ నిరాశపర్చిన వేళ క్రీజులోకి వచ్చిన అతను ఆసిస్ బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 56 బంతుల్లో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. బ్రెవిస్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పలు రికార్డులు బద్దలుకొట్టాడు. సౌతాఫ్రికా తరపున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. అలాగే, ఆస్ట్రేలియా గడ్డపై టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. బ్రెవిస్ విధ్వంసానికి సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 218/7 స్కోరు చేసింది. ఇక, ఛేదనలో ఆస్ట్రేలియా 17.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. టిమ్ డేవిడ్(50) మరోసారి సత్తాచాటిన మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కార్బిన్ బోష్, మఫాకా చెరో 3 వికెట్లు పడగొట్టి ఆసిస్ పతనాన్ని శాసించారు. దీంతో తొలి టీ20లో ఓటమికి ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. మూడో టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక, శనివారం జరిగే మూడో టీ20లోనే సిరీస్ ఫలితం తేలనుంది.






