- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Asian Shooting Championships : సత్తాచాటిన భారత షూటర్లు.. తొలి రోజే నాలుగు పతకాలు
ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి రోజే పతకాల వేట మొదలుపెట్టింది.

దిశ, స్పోర్ట్స్ : కజకస్థాన్‌లో జరుగుతున్న ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి రోజే పతకాల వేట మొదలుపెట్టింది. సోమవారం నాలుగు పతకాలు దక్కగా.. అందులో గోల్డ్ మెడల్ ఉండటం విశేషం. పురుషుల జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో కపిల్ విజేతగా నిలిచాడు. ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత షూటర్లు ఆంటోనీ(582), ముకేశ్(582), కపిల్(579) సత్తాచాటి వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మెడల్ రౌండ్‌లో కపిల్ అదే జోరు కొనసాగించాడు. 243 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. ఇక, ఆంటోనీ 220.7 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. ముకేశ్(157.8) మాత్రం 6వ స్థానంతో సరిపెట్టాడు. మరోవైపు, కపిల్, ఆంటోనీ, విజయ్ తోమర్‌లతో కూడిన భారత జట్టు టీమ్ ఈవెంట్‌లో 1,723 స్కోరుతో రెండో స్థానం దక్కించుకుని సిల్వర్ మెడల్ సాధించింది. ఇక, సీనియర్ విభాగంలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సౌరబ్ చౌదరి, జైన్ అన్మోల్, ఆదిత్యలతో కూడిన భారత జట్టు రజత పతకం కైవసం చేసుకుంది. భారత త్రయం 1,735 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఇక, ఇదే కేటగిరీలో వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించిన జైన్ అన్మోల్‌కు నిరాశ తప్పలేదు. 155.1 స్కోరుతో 6వ స్థానంలో నిలిచాడు.






