- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Asian Shooting Championships : భారత షూటర్ల పతకాల పంట.. ఒకే రోజు నాలుగు గోల్డ్ మెడల్స్ కైవసం
ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల పంట కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : కజకస్థాన్‌లో జరుగుతున్న ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల పంట కొనసాగుతోంది. భారత షూటర్లు గురి చూసి బంగారు పతకాలను కొల్లగొడుతున్నారు. గురువారం ఒకే రోజు నాలుగు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరడం విశేషం. సీనియర్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బాబుటా, కిరణ జాదవ్‌లతో కూడిన భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. ఈ త్రయం 1,892.5 స్కోరుతో చైనా జట్టు(1,889.2)ను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. సీనియర్ విభాగంలో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం. స్కీట్ విభాగంలో అనంత్ జీత్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. చైనా రజతంతో సరిపెట్టగా.. సౌత్ కొరియా(1,885.7) కాంస్యం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో మాజీ వరల్డ్ చాంపియన్ అయిన రుద్రాంక్ష్ తృటిలో పతకాన్ని కోల్పోయాడు. ఫైనల్‌లో 207.6 స్కోరుతో 4వ స్థానంతో సరిపెట్టాడు. అర్జున్(185.8) 5వ స్థానంలో నిలిచాడు.
జూనియర్లు అదరహో..
ఇక టోర్నీలో యువ షట్లర్లు అదరగొడుతున్నారు. అభినవ్ షా గురువారం రెండు గోల్డ్ మెడల్స్(వ్యక్తిగత, టీమ్) సాధించాడు. వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ ఈవెంట్‌లో అభినవ్ 250.4 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే, టీమ్ ఈవెంట్‌లోనూ సత్తాచాటాడు. నరేన్ ప్రణవ్, హిమాన్షు, అభినవ్ త్రయం బంగారు పతకం గెలిచింది. 1,890.1 స్కోరుతో స్వర్ణ పతకం గెలవడంతోపాటు జూనియర్ విభాగంలో వరల్డ్ రికార్డు నెలకొల్పడం విశేషం. అలాగే, మహిళల జూనియర్ స్కీట్ ఈవెంట్‌లో స్వర్ణం, రజతం భారత షూటర్లకే దక్కాయి. మాన్సి రఘువంశీ 53 స్కోరుతో గోల్డ్ మెడల్ గెలవడగా.. యశస్వి రాథోర్ 52 స్కోరుతో సిల్వర్ మెడల్ సాధించింది.






