బాబర్, హెడ్‌లకు షాకిచ్చిన అర్ష్‌దీప్.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న యువ పేసర్

by Harish |   (  Updated:2025-01-25 12:48:42  IST  )

టీమ్ ఇండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 2024లో బెస్ట్ టీ20 క్రికెటర్‌గా నిలిచాడు.

బాబర్, హెడ్‌లకు షాకిచ్చిన అర్ష్‌దీప్.. ఐసీసీ అవార్డు  గెలుచుకున్న యువ పేసర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 2024లో బెస్ట్ టీ20 క్రికెటర్‌గా నిలిచాడు. గతేడాదికి సంబంధించి ‘టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. అవార్డు విన్నర్‌గా అర్ష్‌దీప్‌ను ఐసీసీ శనివారం ప్రకటించింది. ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా), బాబర్ ఆజామ్(పాకిస్తాన్), సికిందర్ రజా(జింబాబ్వే) కూడా అవార్డుకు పోటీపడ్డారు. కానీ, అర్ష్‌దీప్ వారిని వెనక్కినెట్టి అవార్డుకు ఎంపికయ్యాడు. ఇటీవలే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు అర్ష్‌దీప్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 2024లో కూడా ఈ యువ బౌలర్ అద్భుత ప్రదర్శన చేశాడు. 18 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీశాడు. టీమిండియా గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 17 వికెట్లతో టోర్నీలో సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. గత క్యాలెండర్ ఇయర్‌లో అతని కంటే నలుగురు అత్యధిక వికెట్లు తీసినప్పటికీ.. అర్ష్‌దీప్ మెరుగైన ఎకానమీ రేట్‌ను కలిగి ఉన్నాడు. సూర్యకుమార్ తర్వాత టీ20 క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డు గెలిచిన రెండో భారత ఆటగాడు అర్ష్‌దీప్. సూర్య వరుసగా 2022, 2023లలో ఈ అవార్డును దక్కించుకున్నాడు.


Next Story