- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అంకితకు రజతం
by Harish |
ఇరాన్‌లో జరుగుతున్న ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది.

X
దిశ, స్పోర్ట్స్ : ఇరాన్‌లో జరుగుతున్న ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం జరిగిన మహిళల 3,000 మీటర్ల ఈవెంట్‌లో అంకిత ధ్యాని రజత పతకం సాధించింది. అంకిత 9:26:22 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. జపాన్ అథ్లెట్ యుమా యమమోటో(9:16:71 సెకన్లు) అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది నాలుగో పతకం. ఇంతకుముందు మహిళల 1500 మీటర్ల రేసులో హర్మిలన్ బైన్స్, మహిళల 60 మీటర్ల హర్డిల్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి, పురుషుల షాట్‌ఫుట్‌లో తాజిందర్‌పాల్ సింగ్ తోమర్ స్వర్ణ పతకాలు సాధించారు. మెడల్స్ టేబుల్‌లో 4 పతకాలతో భారత్ రెండో స్థానంలో ఉన్నది. చైనా 9 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
Next Story






