Video: పాపం గంభీర్... గ్రౌండ్ లోనే రెచ్చిపోయిన‌ టీమిండియా ఫ్యాన్స్‌..!

by velandi.Saikiran |   (  Updated:2025-11-26 20:30:58  IST  )

దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య జరిగిన రెండో టెస్టులో రిష‌బ్‌ పంత్ సేన దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో

Video: పాపం గంభీర్... గ్రౌండ్ లోనే రెచ్చిపోయిన‌ టీమిండియా ఫ్యాన్స్‌..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత జట్టు పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. విదేశీ గడ్డపై ఆడడం చేత కాదు, కనీసం స్వదేశంలో అయినా మ‌నోళ్లు గెలిస్తే బాగుండేది. కానీ సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా చేతిలో రెండు టెస్టుల్లో కూడా భార‌త జ‌ట్టు అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఈ టెస్ట్ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో భార‌త‌ ప్లేయర్ల కంటే, ఎక్కువగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన అభిమానులు సీరియస్ గా ఉన్నారు. ఓట‌మి పాలైనందుకు భారత ప్లేయర్లను ఒక్క మాట అనని ఫ్యాన్స్, గౌతమ్ గంభీర్ ను మాత్రం గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. వెంటనే తన కోచ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

గౌతమ్ గంభీర్ ను హేళ‌న‌ చేసిన ఫ్యాన్స్

దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య జరిగిన రెండో టెస్టులో రిష‌బ్‌ పంత్ సేన దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయింది భార‌త్. ఇక ఈ బాధలో ఉన్న భారత అభిమానులు, గువాహ‌టి స్టేడియంలో రెచ్చిపోయారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత గ్రౌండ్ లోకి వచ్చిన గౌతమ్ గంభీర్ ను చూసి, చాలా సీరియస్ అయ్యారు భారత అభిమానులు. గౌతమ్ గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు.

వెంటనే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపో అంటూ రెచ్చి పోయారు. అభిమానులు అంతలా అరుస్తుంటే గౌతమ్ గంభీర్ అస్సలు పట్టన‌ట్లే వ్యవహరించారు. కానీ మహమ్మద్ సిరాజ్ మాత్రం, భారత అభిమానులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మూతి పైన వేలు వేసి, అభిమానులకు సైగలు చేసే ప్రయత్నం చేశారు సిరాజ్. కానీ ఆవేశంతో భారత అభిమానులు మాత్రం ఎక్కడ తగ్గలేదు. అటు భార‌త కోచ్ కూడా ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇది ఇలా ఉండ‌గా, న‌వంబ‌ర్ 30వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య వ‌న్డే సిరీస్ కూడా ప్రారంభం కానుంది. క్లిక్

Next Story