విశాఖ మ్యాచ్ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

by velandi.Saikiran |   (  Updated:2025-12-07 03:50:36  IST  )

భారత జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని భారత జట్టు సాధించినట్లు

విశాఖ మ్యాచ్ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: విశాఖ వేదికగా జరిగిన 3వ‌ వన్డేలో భారత జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాపై ఈ మ్యాచ్ లో ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది భారత జట్టు. ఈ విజయంతో 2-1 తేడాతో వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అయితే విశాఖ వేదికగా భారత జట్టు విజయం సాధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

భారత జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని భారత జట్టు సాధించినట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికాపైన భారత ప్లేయర్లు అన్ని విధాల పై చేయి సాధించి విక్టరీ కొట్టారని పేర్కొన్నారు. ముఖ్యంగా యశస్వి జైష్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి దక్షిణాఫ్రికాను చిత్తు చేసినట్లు వెల్లడించారు. విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ హిస్టరీలో మిగిలిపోతుందని పోస్ట్ పెట్టారు చంద్రబాబు నాయుడు. ప్రతి క్రికెట్ అభిమానికి ఈ మ్యాచ్ గుర్తుండిపోతుందని వెల్లడించారు. క్లిక్

Next Story