గ్రౌండ్ లోనే పాకిస్థాన్ ను అవమానించిన టీమిండియా..షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండానే

by velandi.Saikiran |

పాకిస్తాన్ ప్లేయర్లకు... షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే సూర్యకుమార్ యాదవ్ అలాగే శివం దుబే... గ్రౌండ్ వదిలి డ్రెస్సింగ్ రూమ్

IND VS PAK
X

    IND VS PAK

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా ( Team India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య దుబాయ్ ( Dubai) వేదికగా నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 ( Asia Cup 2025) టోర్నమెంట్లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. అయితే అందరూ ముందుగా ఊహించినట్లుగానే పాకిస్తాన్ జట్టును టీమిండియా చిత్తు చేసింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో దారుణంగా విఫలం అయిన పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన సన్నివేశం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఎలాంటి మ్యాచ్ అయినా సరే... ఒకరు గెలవడం అలాగే ఒకరు ఓడిపోవడం జరుగుతుంది. ఇక మ్యాచ్ ఫినిష్ తర్వాత రెండు జట్ల ప్లేయర్లు... షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కానీ నిన్నటి మ్యాచ్ లో అలాంటి సంఘటన జరగలేదు. పాకిస్తాన్ ప్లేయర్లకు... షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే సూర్యకుమార్ యాదవ్ అలాగే శివం దుబే... గ్రౌండ్ వదిలి డ్రెస్సింగ్ రూమ్ వెళ్లిపోయారు.

కేవలం టీమిండియా ప్లేయర్లకు మాత్రమే షేక్ హ్యాండ్ ( No Shake Hand ) ఇచ్చారు. అటు మిగతా ప్లేయర్లు కూడా... గ్రౌండ్ లోకి వచ్చి పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహాల్గాం సంఘటన నేపథ్యంలోనే... టీమిండియా ప్లేయర్లు ఇలా వ్యవహరించినట్లు చెబుతున్నారు. అయితే ఇది చూసిన నెటిజెన్స్.... పాకిస్తాన్ కు ఘోర అవమానం జరిగిందని.. కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వెధవలకు... సూర్య కుమార్ యాదవ్ తగిన బుద్ధి చెప్పాడని అంటున్నారు. క్లిక్

Next Story