Asia Cup 2025: గెలిచినా ట్రోఫీ తీసుకోం...టీమిండియా షాకింగ్ నిర్ణ‌యం !

by velandi.Saikiran |

టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్క‌ల్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. దీనికి కార‌ణంమొహ్సిన్

Asia Cup 2025: గెలిచినా ట్రోఫీ తీసుకోం...టీమిండియా షాకింగ్ నిర్ణ‌యం !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆసియా క‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్ ఇవాళ రాత్రి జ‌రుగ‌నుంది. టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే ఈ మ్యాచ్ దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతోంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం.. ఇవాళ రాత్రి 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. సోనీ లీవ్ లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు చూడొవ‌చ్చు. సోనీ స్పోర్ట్స్ లో కూడా చూడొచ్చు.

అయితే... ఈ మ్యాచ్ నేప‌థ్యంలో... టీమిండియా హాట్ ఫేవ‌రేట్ గానే ఉంద‌ని అంద‌రూ అంటున్నారు. ఈ టోర్న‌మెంట్ లో ఇప్ప‌టికే పాకిస్థాన్ ను రెండు సార్లు చిత్తు చేసింది టీమిండియా. అందుకే ఫైన‌ల్స్ కూడా టీమిండియానే గెలుస్తుంద‌ని అంటున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. ఎలాగూ టీమిండియా గెలుస్తుంద‌ని.. కానీ ట్రోఫీని మాత్రం అందుకోకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

సూర్య కాకుండా... టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్క‌ల్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. దీనికి కార‌ణం మొహ్సిన్ నఖ్వీ. ఏసీసీ ఛైర్మ‌న్ గా ఆయ‌నే ఉన్నారు. కాబ‌ట్టి ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ అందిస్తారు. అత‌ను పాకిస్థాన్ కు చెందిన అధికారి. అలాంటి వారి చేతుల మీదుగా ట్రోఫీని సూర్య తీసుకుంటే.. ట్రోలింగ్ జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. అంటే.. టీమిండియా ఛాంపియ‌న్ అయితే.. సూర్య స్థానంలో మోర్క‌ల్ ట్రోఫీ అందుకుని.. జ‌ట్టుకు ఇస్తారు.

Next Story