టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అభిషేక్ శర్మ విధ్వంసం

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-08 14:07:12  IST  )

అత్యంత కీలకమైన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించారు.

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అభిషేక్ శర్మ విధ్వంసం
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత కీలకమైన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించారు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించారు. ఇందులో మూడు సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. మరోవైపు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా అదరగొడుతున్నారు. సంజూ సైతం కేవలం 17 బంతుల్లోనే 33 పరుగులు చేశారు. ఇందులో మూడు సిక్సులు, రెండు ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరు ఇలాగే రాణిస్తే ఫైనల్‌లో భారత్‌కు మంచి స్కోరు రానుంది.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్( వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా మరియు అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్ జట్టు: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.

Next Story