సోద‌రి పెళ్లికి అభిషేక్ శ‌ర్మ దూరం..కార‌ణం ఇదే!

by velandi.Saikiran |   (  Updated:2025-10-03 17:43:25  IST  )

ఇవాళ కాన్పూర్ వేదికగా జరిగింది. అటు అమృత్ సర్ లో అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ వివాహం ఇవాళ సాయంత్రం

సోద‌రి పెళ్లికి అభిషేక్ శ‌ర్మ దూరం..కార‌ణం ఇదే!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మకు ఊహించని పరిణామం ఎదురయింది. సొంత సోదరి వివాహానికి కూడా అభిషేక్ శర్మ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. టీమిండియా ఏ జట్టులో అభిషేక్ శర్మ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఇవాళ జరిగిన తన సోదరీ వివాహానికి వెళ్లలేకపోయాడని స‌మాచారం. టీమిండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య అనధికారిక వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఇందులో అభిషేక్ శర్మ కూడా ఆడుతున్నాడు.

ఈ వన్డే మ్యాచ్ ఇవాళ కాన్పూర్ వేదికగా జరిగింది. అటు అమృత్ సర్ లో అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ వివాహం ఇవాళ సాయంత్రం జరిగిందని స‌మాచారం అందుతోంది. ఆ సమయానికి కాన్పూర్ లోనే అభిషేక్ శర్మ ఉన్నాడు. దీంతో వివాహానికి అతడు హాజరు కాలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే.. పెళ్లి జరిగిన తర్వాత ఇవాళ అర్ధరాత్రి ఇంటికి చేరుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మాను ప్రముఖ వ్యాపారవేత్త లవిష్ పెళ్లి చేసుకున్నారు.

Next Story