- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8 మ్యాచ్‌ల్లో 5 డకౌట్లు.. నెహ్రా రికార్డు బద్దలు కొట్టిన అభిషేక్
టీ20 ప్రపంచ కప్ లో ఆశిష్ నెహ్రా డకౌట్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.

దిశ, వెబ్ డెస్క్: అభిషేక్ శర్మ... ఈ పేరు వినగానే అందరికీ సిక్సర్లు, బౌండరీలు మాత్రమే వినిపిస్తాయి. ఆ రేంజ్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేస్తాడు అభిషేక్ శర్మ. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు వరకు అభిషేక్ శర్మ విలయతాండవం చేశాడు. సిక్సర్లు, బౌండరీలు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా కూడా ఏ మాత్రం తగ్గలేదు అభిషేక్ శర్మ. అయితే ఐసీసీ నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా మాత్రం అభిషేక్ శర్మ అందరినీ నిరాశ పరుస్తున్నాడు. ఏరి కోరి టీ20 వరల్డ్ కప్ కోసం అభిషేక్ శర్మను సెలెక్ట్ చేస్తే, బీసీసీఐ నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ టీ20 వరల్డ్ కప్ లో అతను ఖాతానే తెరవలేదు.
మూడుసార్లు అభిషేక్ శర్మ డకౌట్
టీ20 వరల్డ్ కప్ 2026 లో భారత్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. చివరి క్షణంలో భారత జట్టులోకి వచ్చిన ఇషాంత్ శర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే లాంటి ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో సూపర్ 8 దాకా సక్సెస్ ఫుల్ గా చేరుకుంది భారత జట్టు. అయితే వాళ్లు ఆడిన నేపథ్యంలో అభిషేక్ శర్మ వైఫల్యం పై ఎవరు ప్రశ్నించడం లేదు. కానీ అభిషేక్ శర్మ ( Abhishek Sharma) ఆట తీరు చూస్తుంటే, అత్యంత భయంకరంగా ఉంది.
టీ20 వరల్డ్ కప్ 2026 లో మూడు మ్యాచ్ లలో అతనికి అవకాశం వచ్చింది. ఈ మూడు మ్యాచ్ లలో ఇప్పటి వరకు ఖాతా ఓపెన్ చేయలేదు. ఒక పరుగు తీయలేదు. మూడు సార్లు డకౌట్ అయ్యాడు అభిషేక్ శర్మ. ఈ టోర్నమెంట్ లో యూఎస్ఏ జట్టుతో మొదట భారత్ మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ ఇరగదీస్తాడని అందరూ అనుకున్నారు. కానీ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత పాకిస్తాన్, బుధవారం నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే పరిస్థితి. ఇలా మొత్తంగా మూడు మ్యాచ్ లలో మూడుసార్లు డకౌట్ అయ్యాడు అభిషేక్ శర్మ. దీంతో అభిషేక్ శర్మను ఉద్దేశించి ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఆశిష్ నెహ్రా సరసన అభిషేక్ శర్మ
టీ20 వరల్డ్ కప్ లో వరుసగా మూడు సార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ, ఆశిష్ నెహ్రా ( Ashish Nehra ) సరసన నిలిచాడు. 2010 సంవత్సరం నుంచి 2016 మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో ఆశిష్ నెహ్రా మూడుసార్లు డకౌట్ అయ్యాడు. అటు అభిషేక్ శర్మ 2026 వరల్డ్ కప్ లో మాత్రమే వరుసగా మూడుసార్లు చరిత్ర సృష్టించాడు. దీంతో ఆశిష్ నెహ్రా ( Nehra) సరసన అభిషేక్ శర్మ నిలిచినట్లు ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. కాగా గత 8 మ్యాచ్ ల్లో 5 సార్లు డకౌట్ అయ్యాడు అభిషేక్.






