టీ20లలో ఆ ముగ్గురే బెస్ట్ : సురేశ్ రైనా

by Harish |

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా టీ20 క్రికెట్‌లో టాప్-3 బ్యాటర్లను ప్రకటించాడు.

టీ20లలో ఆ ముగ్గురే బెస్ట్ : సురేశ్ రైనా
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా టీ20 క్రికెట్‌లో టాప్-3 బ్యాటర్లను ప్రకటించాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రైనా.. టీ20ల్లో సౌతాఫ్రికా బిగ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్‌తోపాటు భారత్ నుంచి అభిషేక్ శర్మ, సూర్యకుమార్‌లను ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ముగ్గురే టీ20ల్లో బెస్ట్ అని తెలిపాడు. ‘వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌పై అభిషేక్ శర్మ సెంచరీ చేశాడు. సూర్యకుమార్ చాలా షాట్లు ఆడగలడు. ఇక, క్లాసెస్‌కు ఉన్న సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం చాలా అరుదు. ప్రస్తుతం వరల్డ్‌లో వారే టాప్-3లో ఉంటారు.’అని తెలిపాడు. అలాగే, ప్రస్తుతం మోస్ట్ అండరేటెడ్ బ్యాటర్ ఎవరు? అని అడగగా రైనా.. ఇషాన్ కిషన్ అని చెప్పాడు. ‘ఇషాన్ కిషన్ చాలా బలమైన ప్లేయర్. అతను అద్భుతంగా ఆడాడు. కానీ, అతను ఇంకా మెరుగ్గా రాణించాలి.’అని సూచించాడు.


Next Story