- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ugadi Special: ఈ ఏడాది తెలంగాణలోని పొలిటికల్ పార్టీల భవిష్యత్ ఇదే..!
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లకు కీలకం కానున్నది. ఆయా పార్టీల అంతర్గత, సంస్థాగత వ్యవహారాలు, ప్రభుత్వ పథకాల అమలు, అవి ప్రజల దరి చేరడం, ప్రజా సమస్యలు, వాటిపై పోరాటాలు ప్రధానంగా ఉండనున్నాయి.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లకు కీలకం కానున్నది. ఆయా పార్టీల అంతర్గత, సంస్థాగత వ్యవహారాలు, ప్రభుత్వ పథకాల అమలు, అవి ప్రజల దరి చేరడం, ప్రజా సమస్యలు, వాటిపై పోరాటాలు ప్రధానంగా ఉండనున్నాయి. వీటన్నింటికి తోడు ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇందులో ఆయా పార్టీలకు ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు వస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. అధికార కాంగ్రెస్..నాయకులు, కేడర్‌ను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారం చేపట్టని బీజేపీ ఆ దిశగా అడుగులు వేసేందుకు కష్ట పడాల్సి ఉండగా.. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని మూడు ముక్కలాట నుంచి బయటపడటం సవాల్‌గా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ పార్టీలకు కీలకంగా మారనుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీలు కీలక పరీక్షను ఎదుర్కొబోతున్నాయి. అన్ని పార్టీలు పార్థీల అంతర్గత, సంస్థాగత వ్యవహరాలు, ప్రభుత్వ పథకాల అమలు, అవి ప్రజలకు చేరడం, ప్రజా సమస్యలు, వాటిపై పోరాటాలు ప్రధానంగా ఉన్నాయి. వీటన్నంటికి తోడుగా వచ్చే సంవత్సరం పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల పాలకవర్గాల సమయం ముగిసింది. ఈ నేపథ్యంలో జరిగే ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు ఉగాది పచ్చడి లాంటి ఫలితాలను పొందుతాయా? ఎలా ఉండబోతుందో చూడాలి. అధికార కాంగ్రెస్అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా ముందుకు వెళ్లాల్సి ఉంది. పార్టీ నాయకులను, కేడర్‌ను ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సమన్వం చేసుకోవాల్సిఉంది. రాష్ట్రంలో ఇంత వరకు అధికారం చేపట్టని బీజేపీ అ దిశగా అడుగులు వేయడానికి ఈ యేడాది కీలకం కానుంది. ఒక అధికారం కోల్పోయి అతాలకుతలం అవుతున్న బీఆర్ఎస్ పార్టీ తన అంతర్గత సమస్యలను సర్దుకొని మూడు ముక్కలాటలో నుంచి బయటపడటం ఆ పార్టీకి సవాల్‌గా మారింది.
బీజేపీ పార్టీ :
భారతీయ జనతా పార్టీ అడుగులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో అద్బుతమైన ఓటు బ్యాంకు, సీట్లు సాధించిన ఆ పార్టీ ఆ తరువాత అంతంత మాత్రమే పనితీరును కనపరుస్తుందని, రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ అదే స్థాయిలో ఊపు, ఉత్సాహాన్ని కొనసాగించలేకపోతుందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడే ఎందుకు లే ఐదు సంవత్సరాల వరకు చూద్దాం అనే కోణంలోనే వారి ఆలోచనలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షంగా దూసుకపోవాల్సిన తరుణంలో ప్రజల అంచనాలకు తగ్గట్లుగా పనిచేయడంలేదని, దూకుడు ప్రదర్శించడంలేదనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు 20 నెలలుగా లేక తాత్కాళిక అధ్యక్షుడితో నెట్టుకొస్తున్నారు. కిషన్‌రెడ్డి అటు కేంద్ర క్యాబినెట్మంత్రి పదవి, ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవి రెండింటిని బ్యాలెన్స్చేయలేక సతమతమవుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అన్ని ముగిసాక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం జరిగినా ఇంత వరకు అలాంటి దాఖలాలు కనిపించడంలేదు. సంస్థాగత ఎన్నికలషెడ్యూల్లో భాగంగా గత డిసెంబర్ కల్లా అద్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. కానీ ఇంత వరకు ఆ సంకేతాలు ఏమి కనిపిండచంలేదు. ప్రతి నెలా వచ్చే నెల అంటూ చెబుతున్నారు తప్పితే అధ్యక్షుడిని మాత్రం నియమించలేకపోతున్నారు. తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోనైనా కొత్త అధ్యక్షుడు వస్తారా ఇంకా మరెంత కాలం సాగిదిస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచిన పార్టీ ప్రజా సమస్యల విషయంలో మాత్రం అనుకున్నంత స్థాయిలో పనిచేయలేకపోతుందని ఆరోపణలు పార్టీ కేడర్ నుంచే వస్తున్నాయి. రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవ ప్రదమైన స్థానాలను దక్కించుకోవడానికి శ్రమించాల్సి ఉంటుందని అంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ :
అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ తెలుగు సంవత్సర యేడాది కీలకంగా మారనుంది. ఇప్పటికే అధికారాన్నికోల్పోయి 15 నెలలు కావస్తుంది. అధికారాన్నిఎందుకు కోల్పోయామనే విషయాన్నే ఆ పార్టీ ఇంత వరకు గ్రహించలేదు. ఇకనైన గ్రహిస్తుంది... దానిని సవరించుకుంటుంది అనే నమ్మకాన్ని ఆ పార్టీ కేడర్ కోల్పోయింది. రాబోయే రోజుల్లో లోపాలను గ్రహిస్తుందనే నమ్మకం లేదని చెబుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటికి రాకపోవడంతో ఆ పార్టీ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, కవితల మధ్య మూడు స్తంబాలాట సాగుతుంది. ఏవరికి వారుగా అదిపత్య పోరు తో ముందుకుసాగుతున్నారు. తాము ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని, అన్ని వైపుల నుంచి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నామని, అనుకుంటున్నా.. ముగ్గురిలో ఏవరి దగ్గరికి పోవాలో.. .ఏవరికి దగ్గరికి పోతే మిగిలిన ఇద్దరు ఏమనుకుంటారో ఆందోళన పార్టీ కేడర్ ఆందోళన చెందుతుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలన్ని జరగనున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస స్థాయిలో గౌరవ ప్రదమైన స్థానాలను కైవసం చేసుకోకుంటే పార్టీ పరిస్థితి అంతేనని పార్టీ నాయకులు, రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పార్టీ కేడర్ కింది స్థాయి నుంచి బలోపేతం చేయడం కాకుండా అధికార పార్టీ మీద వ్యతిరేకత వస్తే తమకే ఓటు వేస్తారనే లెక్కల్లో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ..
అధికార కాంగ్రెస్ పార్టీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కీలకమైన పనులు చేపట్టాల్సి ఉంది. ఆటు పార్టీ పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా అనేక లక్ష్యాలు ముందున్నాయి. మంత్రివర్గ విస్తరణ, ఆ తరువాత పీసీసీ కార్యవర్గం, ఆ తరువాత పార్టీ పదవులు, నామినెటెడ్ పదవులు ఇలా కీలకమైనవి భర్తి చేయాల్సి ఉంది. వీటిని పార్టీలో కష్టపడ్డ వారికి మొదటి నుంచి ఉన్న వారికి కల్పించాల్సి ఉంది. సామాజికవర్గాలు, జిల్లాలు ఇలా అనేక కోణాల్లో పరిశీలించి భర్తీ చేయాల్సి ఉంది. ఆ తరువాత వరుస స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. అధికార పార్టీ గా ఉండి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించకుంటే పార్టీ కి ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ పథకాల అమలుకు నిధులు సమీకరించడం ప్రభుత్వానికి సవాల్ గా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డిలు, అసలు చెల్లించడానికే తిప్పలు పడాల్సివస్తుంది. ఈ ప్రస్తుత శ్రీ విశ్వావసు నామ యేడాదిలోనైనా ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు, పార్టీ పరంగా విజయాలు నమోదు చేసుకోవాల్సి ఉంది. పది సంవత్సరాలు అధికారంలో లేకపోవడంతో పార్టీ నాయకులు భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. వారందరిని సంతృప్తి పర్చడం అధినాయకులకు తలకుమించిన వ్యవహరంగా మారింది. వీటన్నింటిని సమన్వయం చేసుకొని ప్రతిపక్షాల దుష్పప్రచారాన్ని తిప్పికొట్టడం, వాస్తవాలు ప్రజల్లోకి తీసుకవెళ్లడం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కత్తి మీద సామే.






