1986 లో మిస్సైన స్కూల్ బస్.. మిస్టరీగా మారిన 15 మంది స్టూడెంట్స్ ఆచూకీ

by Muthe.Rajitha |   (  Updated:2025-08-30 11:24:25  IST  )

దాదాపు 40 ఏళ్ల కింద 15 మంది స్టూడెంట్స్, ఓ టీచర్ తో సహా అదృశ్యమై దేశాన్ని కుదిపేసిన సంఘటన మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

1986 లో మిస్సైన స్కూల్ బస్.. మిస్టరీగా మారిన 15 మంది స్టూడెంట్స్ ఆచూకీ
X

దిశ, వెబ్ డెస్క్ : దాదాపు 40 ఏళ్ల కింద 15 మంది స్టూడెంట్స్, ఓ టీచర్ తో సహా అదృశ్యమై దేశాన్ని కుదిపేసిన సంఘటన మళ్లీ వార్తల్లోకి వచ్చింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి ఆధారాలు దొరకని ఆ కేసులో ఇప్పుడు కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. అడవిలో తవ్వకాలు చేస్తున్న కార్మికులు మట్టిలో పాతిపెట్టబడిన ఒక స్కూల్ బస్సును కనుగొన్నారు. అది 1986లో కనబడకుండా పోయిన బస్సేనని అధికారులు ధృవీకరించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బస్సు చెక్కుచెదరకుండా ఉండగా.. మిస్టీరియస గా ఆ బస్సులో మనుషుల ఆనవాళ్లు ఒక్కటి కూడా లేవు. ఇంతకీ ఎం జరిగిందంటే??

1986 జూన్‌లో అమెరికాలోని సెబ్రా పట్టణంలోని చిన్నారులు పాఠశాల నుంచి మార్నింగ్ లేక్ వద్దకు ఫీల్డ్ ట్రిప్ కోసం బయలుదేరారు. అయితే హైవే మీద కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత ఆ బస్సు కనబడకుండా పోయింది. మార్నింగ్ లేక్ కు వెళ్లే దారిలో ఉన్న అడవిమార్గంలోనే ఆ బస్సు చివరిసారిగా కనిపించినట్టు అటుగా వెళ్లిన వారు చెప్పగలిగారు. ఆ తర్వాత కొన్ని వందలమంది స్థానికులు, పోలీసులు కొన్నినెలల వరకు గాలించినా ఎటువంటి సమాచారం లభించలేదు. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇటీవల అనూహ్యంగా మళ్ళీ ఆ బస్సును కనుగొనడంతో మరోసారి ఆ మిస్టరీ గురించి మీడియాలోకి వచ్చింది. తాజాగా బయటపడిన బస్సులో అధికారులకు కొన్ని ఆశ్చర్యపరిచే వస్తువులు లభించాయి. ఒక డైరీ, ఒక క్యాసెట్ టేప్, ఒక లెటర్ దొరికింది. ఆ డైరీలో ఆ బస్సులో తప్పిపోయిన ఒక అబ్బాయి పేరు మాత్రమే ప్రస్తావించి ఉంది. మేమెప్పటికీ మీకు కనబడం అని కూడా రాసి ఉండటం, లెటర్ లో మమ్మల్ని వెతకకండి అని రాసి ఉండటం ఈ మిస్టరీకి మరింత మిస్టరీని జోడించింది.

ఈ ఆధారాల గురించి పోలీసులు పూర్తిగా బయటపెట్టడం లేదు గాని, మరింత దర్యాప్తు అవసరం అని మాత్రమే చెబుతున్నారు. ఈ కేసును 'షెరీఫ్ లానా విటాకర్' అనే డిటెక్టీవ్ దర్యాప్తు చేస్తున్నారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆరోజు స్కూల్ ట్రిప్ కు వెళ్లకుండా ఉన్నవాళ్లలో షెరీఫ్ కూడా ఒకరు. ఇది యాదృచ్చికమే అయినా.. ఈ మిస్టరీ కేసులో ఇది కూడా ఆశ్చర్యకర విషయమే. '39 ఏళ్ల తర్వాత ఈ బస్సు బయటపడటం యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఎవరో ఉద్దేశపూర్వకంగా ఒక రహస్యం దాచినట్టు ఉంది.' అని షెరీఫ్ మీడియాకు తెలిపారు.

మిస్టరీగా మిగిలిన ప్రశ్నలు... మరి ఆ పిల్లలకు, టీచర్ కు ఏమైంది? వాళ్లు అసలు మార్నింగ్ లేక్ చేరలేదా? బస్సును అడవిలో ఎవరు పాతిపెట్టారు? బస్సు లోపల వదిలిన హింట్స్ వెనుక ఉద్దేశం ఏమిటి? అనేవి సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. అధికారులు మాత్రం ఈ కేసు మిస్టరీ మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా అని వెల్లడించారు. చరిత్ర నుంచి చెరిపేయబడ్డ ఆ స్టూడెంట్స్ మిస్టరీ గురించి అమెరికాలో మాత్రమే కాదు, అన్ని దేశాల్లోను తీవ్రంగా చర్చ నడుస్తోంది.

అయితే కొద్దిమంది మాత్రం అసలు ఇలాంటి ఘటన చరిత్రలో జరగనేలేదని కొట్టివేస్తున్నారు. ఎవరో ఒక దొంగ స్కూల్ బస్సు దొంగిలించి దానిని ఏం చేయాలో తెలియక, అడవిలో పాతిపెట్టి ఉంటాడని, దానివెనుక ఈ కట్టుకథ అల్లారని అంటున్నవారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఈ మిస్టరీ ఇపుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Next Story