- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పనస ప్రొడక్ట్స్‌తో రూ.8 లక్షల ఆదాయం.. 57 ఏళ్ల వయసులో "రాణి" విజయమిది
పనస పండ్లంటే (Jackfruit) చాలా మంది ఇష్టపడతారు. పనస తొనలతో పాటు పనస గింజలను కూరగా వండుకుని కూడా తింటారు.

దిశ, వెబ్‌డెస్క్: పనస పండ్లంటే (Jackfruit) చాలా మంది ఇష్టపడతారు. పనస తొనలతో పాటు పనస గింజలను కూరగా వండుకుని కూడా తింటారు. అలాంటి పనసతొనలు సీజన్ వారిగానే కాకుండా పౌడర్, చిప్స్ రూపంలో ఎప్పుడూ అందుబాటులో ఉండేలా కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ తయారు చేయడం ద్వారా ఏడాదికి గణనీయమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు రాణి సన్నీ. కేరళలోని ఇడుక్కికి చెందిన ఆమె.. పనసపండ్ల ప్రొడక్ట్స్ ద్వారా మరో 10 మందికి ఉపాధి కల్పించడంతో పాటు.. సుమారు 20 మంది రైతులకు కూడా గిట్టుబాటు ధరను ఇస్తున్నారు.
రాణి ఇంటి పెరటిలో నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏలకులు పండించేవారు. వాటితోపాటు పనసపండ్లు కూడా రాగా.. ఆయ కాయల్ని నరికి పారేసేవారు. అప్పట్లో వాటి విలువేంటో తెలీదని రాణి ఇప్పటికీ చెప్తుంటారు. ఏలకుల మొక్కలకు నీడకోసమే పనస చెట్లను పెంచేవారమని, 2017 వరకూ వాటి గురించి తెలియక పారేసేవారమని తెలిపారామె. ఆ తర్వాత ఒక శిక్షణా కార్యక్రమంలోవాటి విలువ తెలియడంతో.. పనసపండ్ల నుంచి వినూత్నమైన ఉత్పత్తులను తయారు చేశారు. 57 ఏళ్ల వయసులో 'ఈడెన్ జాక్‌ఫ్రూట్ ప్రొడక్ట్స్' అనే పేరుతో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆమె ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న గదిలో మొదలుపెట్టిన ఈ వ్యాపారం ప్రస్తుతం సంవత్సరానికి రూ.8 లక్షల వరకు లాభాలను తెచ్చిపెడుతోంది.
వాటిలో ఎండిన పనస పండు, ఎండిన పనస పండు పొడి, గడ్డకట్టిన పచ్చి పనస పండు, పనస పండు పొడి, ఎండిన పనస గింజ, ఎండిన పనస గింజల పొడి పనస గుజ్జు మొదలైనవి తయారు చేస్తారు. వీటిని సప్లిమెంట్స్, కట్లెట్స్, బర్గర్ ప్యాటీస్ ఇంకా అనేక ఇతర వంటకాల తయారీలో ఉపయోగించారు. చిన్నతనంలో తన తల్లి పనసపండుతో వంటకాలు చేసేవారని, వాటిలో చక్క వట్టల్ చిప్స్ బాగా ఇష్టమని తెలిపారు. అవి బనానా చిప్స్ కంటే టేస్టీగా ఉంటాయని తెలిపారు.
ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేవడంతో తన దినచర్య ప్రారంభమవుతుందని, ఇంటి పనులు చక్కబెట్టాక వ్యాపార పనులు చూసుకుంటానని తెలిపారు. తన తల్లి తయారు చేసే పనస చిప్స్ టేస్ట్ ను తాను మరెక్కడా చూడలేదని కూతురు అన్నా తెలిపింది. డెలాయిట్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆమె.. తన తల్లి నుంచి తానెంతో నేర్చుకున్నానని, ఈ వయసులోనూ ఆమె కష్టపడుతున్న తీరే తనకు ఆదర్శమని చెప్పారు.






