- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శృంగార సమయంలో ఆ కారణంగా నొప్పి..! అతని కాపురం సాగేదెలా?
శృంగార సమయంలో ఆ కారణంగా నొప్పి..! అతని కాపురం సాగేదెలా?

దిశ, ఫీచర్స్ : దాంపత్య జీవితంలో శృంగారం(Sex) ఒక భాగం. అది లేనిదే కాపురాలు సక్రమంగా సాగవని పెద్దలు, కూడా నిపుణులు సైతం చెబుతుంటారు. అందుకే సెక్స్ అనేది కేవలం శారీరక వాంఛలు తీర్చుకునే మొక్కబడి కార్యక్రమం కాదు. భార్యా భర్తల ఆరోగ్యానికి, మానసిక ఆనందానికి దోహదం చేసే అద్భుతమైన వ్యాయామం కూడాను. అయితే ఈ విషయంలోనూ పలు అనుమానాలు, సందేహాలు వెంటాడుతుంటాయి కొందరిని. అలాంటి వాటికి సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్ డాక్టర్ భారతిగారి సలహాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మేడం.. సెక్స్‌లో కలిసేటప్పుడు నొప్పి రావడానికి శారీరక కారణాలు ఇన్ఫెక్షన్స్ అయితే మానసిక కారణాలు ఏముంటాయి ? మా కోడలితో మాకు సమస్య వచ్చింది. మా కొడుకు కాపురం సరిదిద్దేది ఎలా ? - రేఖ, ర్యాలమడుగు
జవాబు : సెక్స్.. రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు. రెండు మనసుల కలయిక కూడాను. ఇద్దరి మధ్యా సెక్స్ కు శరీరాలతోపాటు మనసులూ కలిసినపుడే ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. శారీరక కారణాలను పక్కన పెడితే.. మానసిక కారణాలు అనేకం ఉంటాయి.
*శృంగారంలో మొదటి కలయికలో లేదా ప్రతిసారి నొప్పి కలుగుతుందన్న అపోహతో కూడిన భయం వల్ల కూడా యోని కండరాలు బిగుసుకుపోయి కలయిక జరగదు. జరిగినా కష్టమవుతుంది. ఈ భయాల వలన శ్రావాలు ఊరక లూబ్రికేషన్ తగ్గి కలయిక జరగక స్త్రీలలో నొప్పి కలుగుతుంది .
*మొదటి కలయికలోనే పురుషులు సున్నితంగా ఉండకుండా, మొరటుగా ప్రవర్తిస్తే అది కూడా భయాన్ని కలిగిస్తుంది.
*స్త్రీలు ఎదిగే క్రమంలో ఎదురయ్యే అనేక సామాజిక కారణాల వలన వారి వ్యక్తిత్వంలో కనిపించే మానసిక అపసవ్యతలు, లోపాలు భర్తతో సంబంధం నిర్వహణలో వైఫల్యాలకు కారణమవుతాయి.
*కుటుంబంలో, సమాజంలో చిన్నప్పుడు ఎదుర్కొనే చేదు శృంగార అనుభవాలు కూడా అంత:చేతనలో పనిచేస్తూ భర్తతో కలయిక జరిగేటప్పుడు తీవ్రమైన భయాన్ని కలిగిస్తాయి. కాబట్టి మీ కోడలిని ఒకసారి సెక్సాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్లి భయాన్ని పోగొట్టడానికి కౌన్సెలింగ్ ఇప్పించండి. అలాగే మీ అబ్బాయి మీ కోడలితో సున్నితంగా ప్రవర్తిస్తున్నాడా ? క్రూరంగా ఉంటున్నాడా ? తెలుసుకుని.. ఇద్దరినీ తీసుకొని మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్లండి.
డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






